Lokayukta: ప్రభుత్వ చర్యలపై లోకాయుక్త సంతృప్తి
ABN , Publish Date - Dec 05 , 2024 | 08:26 AM
విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఉడా) ఆధీనంలోని స్థలాల కేటాయింపుపై 'ఆంధ్రజ్యోతి' కథనాలతో సుమోటోగా తీసుకున్న లోకా యుక్త. అధికారులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కేసును ఉపసంహరించుకుంది.
కర్నూలు: ఉడా స్థలాల కేటాయింపుపై ప్రభుత్వ చర్యల (AP Govt. Actions)పై లోకయుక్త (Lokayukta) సంతృప్తి (Satisfied) వ్యక్తం చేసింది. విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (Visakhapatnam Urban Development Authority) ఆధీనంలోని స్థలాల కేటాయింపు (Allocation of places)పై ఆంధ్రజ్యోతి (Andhrajyothy) కథనాలతో లోకాయుక్త సుమోటోగా తీసుకుంది. దీంతో ఉడా స్థలాల కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకోవడంతో కేసు ముగిస్గున్నట్లు లోకాయుక్త వెల్లడించింది.
పూర్తి వివరాలు..
విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఉడా) ఆధీనంలోని స్థలాల కేటాయింపుపై 'ఆంధ్రజ్యోతి' కథనాలతో సుమోటోగా తీసుకున్న లోకాయుక్త. అధికారులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కేసును బుధవారం ఉపసంహరించుకుంది. ఉడా ఆధీనంలోని ఎన్పీపీ లేఅవుట్లలోని 1వ సెక్టారులో కమ్యూనిటీ సెంటర్, ఓపెన్ స్థలాలు, రుషికొండ లేవుట్లోని కొన్ని ప్లాట్లలో కొన్ని అనర్హులకు కేటాయించారు. ఈ వ్యవహారంపై 'ఆంధ్రజ్యోతి' 2012 ఫిబ్రవరి 24న ఒక కథనం ప్రచురించింది. దీనిపై రాష్ట్ర లోకాయుక్త వెంటనే స్పందించి సుమోటోగా రెండు కేసులు నమోదు చేసి ప్రభుత్వానికి నోటీసులు పంపింది. సీఐడీ, విజి లెన్స్, ఏసీబీ అధికారులు ఉడాలో పనిచేసిన పలువురు అధికారులపై కేసులు నమోదు చేయడంతో వారిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమ తించగా, 94 కేసులు దాఖలయ్యాయి. ఈ చర్యలతో సంతృప్తి చెందిన లోకాయుక్త క్రింద చూపిన విధంగా, ప్రజా ప్రయోజనార్థం వైయస్ఆర్ జిల్లా, దువ్వూరు మండలం, గొల్లవ (భూసే) జియన్‌యస్‌యస్., కడప అధికారి వరుస సంఖ్య కేసులను ముగిస్తూ దేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఫ్ వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News