Share News

నల్లమల ఘాట్‌లో లారీ బ్రేక్‌ ఫెయిల్‌

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:19 AM

నల్లమల ఘాట్‌లో లారీ బ్రేక్‌ ఫెయిల్‌

నల్లమల ఘాట్‌లో లారీ బ్రేక్‌ ఫెయిల్‌

కొండను ఢీకొట్టి పక్కకు దూకిన డ్రైవర్‌

తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు

చికిత్స పొందుతూ మృతి

మహానంది, ఏప్రిల్‌ 21: మహానంది మండలం నల్లమల ఘూట్‌లో ఆదివారం తెల్లవారుజామున క్రాంతి ట్రాస్స్‌పోర్టుకు చెందిన వాహనం బ్రేకులు ఫెయిల్‌ కావడంతో కొండను ఢీ కొట్టింది. ఈప్రమాదంలో డ్రైవర్‌ ఎలగాటి పెద్దిరాజు(39) మృతి చెందినట్లు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ తెలిపారు. ఏలూరు నుంచి కర్నూలుకు క్రాంతి ట్రాన్స్‌పోర్టుకు చెందిన పార్సిల్‌ లారీ మార్గమధ్యలోని నల్లమల ఘాట్‌ పాత టన్నెల్‌ బొగద వద్దకు చేరుకుంది. ఇక్కడికి వచ్చేసరికి బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన లారీ డ్రైవర్‌ పెద్దిరాజు రహదారి పక్కనే ఉన్న కొండను ఢీకొట్టించి పక్కకు దూకాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 22 , 2024 | 12:19 AM