మాదిగ ఉద్యోగులు ఐక్యంగా ఉండాలి
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:11 AM
మాదిగ ఉద్యోగులంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్య క్షుడు దేవరపల్లి బిక్షాలు మాదిగ అన్నారు.
ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బిక్షాలు మాదిగ
కర్నూలు రూరల్ నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మాదిగ ఉద్యోగులంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్య క్షుడు దేవరపల్లి బిక్షాలు మాదిగ అన్నారు. స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో సోమవారం ఎంఈఎఫ్ జిల్లా ఇనచార్జి జీసీ సుబ్బరాయుడు అధ్యక్షతన నిర్వహించిన మాదిగ ఉద్యో గుల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు దేవర పల్లి బిక్షాలు మాదిగ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో మాదిగ జాతి అభివృద్ది చెందాలంటే మాదిగ ఉద్యోగులంతా ఏకతాటిపై నిలిచి జాతి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.నాయకంటి మద్దయ్య మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ ఉద్యమ ఫలితంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ద్వారా సాధించుకు న్నామన్నారు. అనంతరం కర్నూలు జిల్లా మాదిగ ఉద్యోగుల సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా చిన్ననారా యణ మాదిగ, సురేంద్రనాథ్, శ్రీనివాసులు గౌరవ అధ్యక్షులుగా ప్రకాష్ రాజ్ మాదిగ, మజిల్, జిల్లా అధ్యక్షులుగా ప్రదీప్‌కుమార్ మాదిగ, వర్కింగ్ ప్రసిడెంట్ తిమ్మరాజు మాదిగ, జనరల్ సెక్రటరీ పసుపుల శ్రీరాములు, కోశాధికారి అడ్డాకుల సురేష్‌తోపాటు మరికొంతమంది ఉద్యోగులను ఎన్నుకున్నారు.