మల్లన్న హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు
ABN , Publish Date - Nov 19 , 2024 | 11:35 PM
శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఈ హుండీల లెక్కింపు ద్వారా రూ.4,14,15,623 నగదు రాబడిగా లభించింది.
శ్రీశైలం, నవంబరు 19(ఆంధ్రజోతి): శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఈ హుండీల లెక్కింపు ద్వారా రూ.4,14,15,623 నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 26 రోజుల్లో సమర్పించారు. నగదుతో పాటు 32.230 తులాల బంగారు, 8.5 కిలోల వెండి లభించాయి. అదేవిధంగా 739 యూఎస్‌ఏ డాలర్లు, 135 ఆస్ర్టేలియా డాలర్లు, 50 యూఏఈ దిర్హమ్స్, 100 కెనడా డాలర్లు, 205 సింగపూర్ డాలర్లు, 200 ఘనా సీడిస్, 1000 ఉగాండా షిల్లింగ్సు, 1020 మెక్సికో పిసో మొదలైన విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా, సీసీ కెమెరాలు, అధికారుల పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపును నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ అన్ని విభాగాల అధిపతులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.