శ్రీశైలంలో నటకిరీటి
ABN , Publish Date - Nov 30 , 2024 | 11:55 PM
శ్రీశైలం మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి అమ్మవార్లను సినీ నటుడు రాజేంద్రప్రసాద్ శనివారం దర్శించుకున్నారు.
శ్రీశైలం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి అమ్మవార్లను సినీ నటుడు రాజేంద్రప్రసాద్ శనివారం దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చిన రాజేంద్రప్రసాద్‌కు అధికారులు స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందజేశారు. దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.