నాటు సారా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం
ABN , Publish Date - Apr 12 , 2024 | 12:21 AM
నాటు సారా, అక్రమ మద్యంపై ఉక్కు పాదం మోపుతామని స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ ఎం. సుధాకర్‌రెడ్డి ఆదేశించారు.
పాత నేరస్థులపై బైండోవర్ కేసులు పెట్టండి
సెబ్ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్‌రెడ్డి
కర్నూలు(అర్బన్), ఏప్రిల్ 11: నాటు సారా, అక్రమ మద్యంపై ఉక్కు పాదం మోపుతామని స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ ఎం. సుధాకర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించి, పంచలింగాల, సుంకేశుల చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, నాటు సారా, అనధికార మద్యం అమ్మకం కేంద్రాలపై దాడులు విస్తృతం చేయాలని ఆదేశించారు. పాత నేరస్తులందరినీ ముందస్తుగా బైండోవర్ చేయాలని ఆదేశించారు. మద్యం డంపింగ్‌లపై దృష్టి సారించి, పాత నేరస్తులపై నిఘా పెంచాలని తెలిపారు. ప్రధాన కింగ్ పిన్‌లను గుర్తించి వారిపై పీడీ యాక్ట్, జిల్లా బహిష్కరణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌స్పెక్టర్ కేఈర్ రాజేంద్ర ప్రసాద్, డీటీఎఫ్ సీఐ ఈ. నరసానాయుడు, సుంకేశుల చెక్ పోస్టు సీఐ మల్లిక, పంచలింగాల చెక్ పోస్టు సీఐ రాజశేఖర్ పాల్గొన్నారు.