Share News

అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు

ABN , Publish Date - Nov 12 , 2024 | 12:48 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా అన్నారు.

అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
బాధితుడితో మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజిత్‌బాషా

కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. పీజీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో వచ్చే దరఖా స్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. డీఎస్‌డీవో, ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి రిజిస్ర్టేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ పత్తికొండ లాగిన్‌లో ఏడు రోజుల కింద అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిని ఓపెన్‌ చేసి చూడలేదని, ప్రతిసారి గుర్తు చేయాలా అని అసహ నం వ్యక్తం చేశారు. రీఓపెన్‌ కేసులకు సంబంధించి 25 అర్జీలు వచ్చాయని అన్నారు. సర్వే శాఖకు సంబంధించి ఐదు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశి ంచారు. సీఎం గ్రీవెన్స్‌కు సంబంధించి 18 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, స్పెష ల్‌ డిప్యూటీ కలెక్టర్లు కొండయ్య, చిరంజీవి, నాగ ప్రసన్న లక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొ న్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:48 AM