Share News

రియల్‌ దందా

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:37 AM

తుగ్గలి మండలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల దందా సాగుతోంది. వ్యవసాయ భూములను ల్యాండ్‌ కన్వర్షన్‌, పంచాయతీ అనుమతి లేకుండానే ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. దీంతో పంచాయతీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అధికారులు చోద్యం చూస్తుండటంపై విమర్శలున్నాయి.

రియల్‌ దందా
తుగ్గలి మండలం జి.ఎర్రగుడి వద్ద వేసిన ప్లాట్లు

తుగ్గలి మండలంలో జోరుగా అక్రమ లే అవుట్లు

ల్యాండ్‌ కన్వర్షన్‌, అనుమతి లేకుండానే విక్రయాలు

నష్టపోతున్న వినియోగదారులు, చోద్యం చూస్తున్న అధికారులు

తుగ్గలి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలో రియల్‌ ఎస్టేట్‌ వాపారులు రెచ్చిపోతున్నారు. వ్యవ సాయ భూములను ఎలాంటి అనుమతి లేకుండనే ప్లాట్లుగా మార్చి విక్రయిస్తు న్నారు. జి.ఎర్రగుడి, రాంపల్లి అడ్‌ రోడ్డు, తుగ్గలి, రాతన, పెండేకల్‌ ఆర్‌ఎస్‌, బొందిమడుగుల, ఎద్దులదొడ్డి తదితర ప్రాంతాల్లో దందా సాగుతోంది.

ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయకుండానే..

వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చేందుకు ముందుగా ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయాలి. ఇందుకు ప్రభుత్వానికి నిబంధనల మేరకు చలానా కట్టాల్సి ఉంటుంది. అయితే రియల్‌ వ్యాపారులు ఇవేవీ పట్టించుకోకుండానే వ్యవసాయ భూముల్లోనే వెంచర్లు వేస్తున్నారు. ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయకుంటే పంచాయతీ అనుమతి లభించదు. దీంతో ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది.

చోద్యం చూస్తున్న అధికారులు

రియల్టర్లు ఇలా అడ్డగోలుగా ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నా పంచాయతీ అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే గాని చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్లాట్లు కొంటే అంతే..

అనుమతులు లేకుండా ప్లాట్లు కొన్న వినియోగదా రులు భవిష్యత్తులో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఈ స్థలాల్లో ఇంటి నిర్మాణానికి పంచాయతీ అనుమతి లభించదు, రుణాలు కూడా అందవు. చట్టపరంగా ప్లాట్లపై ఎలాంటి హక్కులు ఉండవు. జిల్లా అధికారులు స్పందించి అక్రమ లేఅవుట్లను అరకట్టి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అనుమతి తీసుకునే చేయాలని ప్రజలు కోరుతున్నారు.

అనుమతి లేకుంటే రద్దు చేస్తాం

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే లే అవుట్లు వేయాలి. పరిశీలించి వ్యాపారులకు నోటీసులు జారీచేస్తాం. అనుమతి తీసుకోకుంటే ఆ లే అవుట్లను రద్దు చేస్తాం.

- రమాదేవి, తహసీల్దార్‌, తుగ్గలి.

Updated Date - Nov 20 , 2024 | 12:37 AM