Share News

ఆకాశంలోకి ఉల్లి ధర

ABN , Publish Date - Jun 18 , 2024 | 11:38 PM

ఉల్లిగడ్డల ధరలు మళ్లీ ఆకాశానికి ఎగబాకుతున్నాయి. మంగళవారం కర్నూలు నగరంలోని మార్కెట్‌ యార్డులో రైతులు విక్రయానికి తెచ్చిన ఉల్లి ధరలు క్వింటంపై గరిష్ఠ, మధ్యస్థ ధరలు రూ.1,835, కనిష్ఠ ధర రూ.1401గా నమోదయ్యాయి.

ఆకాశంలోకి ఉల్లి ధర

క్వింటం రూ.1,835

సంతోషంలో రైతులు

కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 18 : ఉల్లిగడ్డల ధరలు మళ్లీ ఆకాశానికి ఎగబాకుతున్నాయి. మంగళవారం కర్నూలు నగరంలోని మార్కెట్‌ యార్డులో రైతులు విక్రయానికి తెచ్చిన ఉల్లి ధరలు క్వింటంపై గరిష్ఠ, మధ్యస్థ ధరలు రూ.1,835, కనిష్ఠ ధర రూ.1401గా నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ గోవిందు, అదనపు సెక్రటరీలు వెంకటేశ్‌, రెహిమాన్‌ తెలిపారు. అదే విధంగా కందుల ధరలు కూడా పెరుగుతున్నాయని, గరిష్ఠ ధర క్వింటం రూ.11,251 నమోదైందని, కనిష్ఠ ధర రూ.2,052 ఉందని తెలిపారు. శనగలు గరిష్ఠ ధర, కనిష్ఠ ధర రూ.6,709 రైతులకు లభించిందని, ఎండుమిర్చి క్వింటం గరిష్ఠ ధర రూ.9,449, కనిష్ఠ ధర రూ.6,599 అని సెక్రటరీ గోవిందు తెలిపారు. వేరుశనగ కాయలకు గరిష్ఠ ధర రూ.7,100, మద్యస్థ ధర రూ.6,069, కనిష్ఠ ధర రూ.2,882 రైతులకు అందినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jun 18 , 2024 | 11:38 PM