Share News

మరింత తగ్గిన ఉల్లి ధర

ABN , Publish Date - Dec 17 , 2024 | 12:38 AM

మహారాష్ట్ర నుంచి కర్నూలు మార్కెట్‌ యార్డుకు, పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఉల్లిగడ్డలను వ్యాపారులు దిగు మతి చేసుకుం టున్నారు. దీంతో కర్నూలు జిల్లా ఉల్లికి డిమాండ్‌ తగ్గిపోతోంది. శని వారం క్వింటం ఉల్లి రూ.3,600కు గరిష్ఠ ధర రైతుల కు లభించగా.. సోమవారం మరిం త దిగజారింది.

మరింత తగ్గిన ఉల్లి ధర
కర్నూలు మార్కెట్‌ యార్డుకు వచ్చిన ఉల్లి

క్వింటం గరిష్ఠంగా రూ.3,149

కొనసాగుతున్న మహారాష్ట్ర ఉల్లి ఎఫెక్ట్‌

కర్నూలు అగ్రికల్చర్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర నుంచి కర్నూలు మార్కెట్‌ యార్డుకు, పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఉల్లిగడ్డలను వ్యాపారులు దిగు మతి చేసుకుం టున్నారు. దీంతో కర్నూలు జిల్లా ఉల్లికి డిమాండ్‌ తగ్గిపోతోంది. శని వారం క్వింటం ఉల్లి రూ.3,600కు గరిష్ఠ ధర రైతుల కు లభించగా.. సోమవారం మరిం త దిగజారింది. కేవలం క్వింటం ఉల్లి గరిష్ఠ ధర రూ.3,149, మధ్యస్థ ధర రూ.2,259, కనిష్ఠ ధర రూ.615కు తగ్గిపోవడంతో ఉల్లి రైతులు ఆవేదన చెందుతున్నారు. అదే విధంగా కందులు గత శనివారం రూ.9,999 గరిష్ఠ ధర నమోదు కాగా, సోమవారం ఏకంగా రూ.1000 తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 1,987 క్వింటాళ్ల కందులు రావడంతో వ్యాపారులు అమాంతం ధరను తగ్గించేశారు. మొక్కజొన్న ధరలు కూడా తగ్గిపోయాయి. ప్రభుత్వం ప్రకటించిన రూ.2,250 కంటే రూ.100 తక్కువైంది. మొక్కజొన్నలకు గరిష్ఠ ధర రూ.2,309, మధ్యస్థ ధర, కనిష్ట ధరలు కేవలం రూ.2,109 నమో దయ్యాయి. ఎండు మిరప కా యల ధర పూర్తిగా తగ్గిపో యింది. గత సంవత్సరం ఇదే సమయానికి క్వింటం ఎండుమిర్చి రూ.30 వేలపైనే ఉండగా.. సోమ వారం గరిష్ఠ ధర రూ.15,499 మాత్రమే రైతుకు దక్కింది. మధ్యస్థ ధర రూ.14,299, కనిష్ట ధర రూ.2,349 దక్కింది. మినుములకు గరిష్ఠ, మధ్యస్థ, కనిష్ఠ ధరలు రూ.8,287 దక్కింది. సజ్జలకు గరిష్ఠ, మధ్యస్థ, కనిష్ఠ ధర క్వింటానికి రూ.2,291 పలికింది. కొర్రలకు గరిష్ఠ, మధ్యస్థ ధరలు రూ.2,531, కనిష్ఠ ధర రూ.1,609 లభించింది. వేరుశనగకాయలకు గరిష్ఠ ధర రూ.6,799, మధ్యస్థ ధర రూ. 5,120, కనిష్థం రూ.4,069 మాత్రమే దక్కింది.

Updated Date - Dec 17 , 2024 | 12:40 AM