విద్యుత డిస్కమ్ ప్రైవేటీకరణను వ్యతిరేకించండి
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:38 AM
చండీఘర్ ప్రభుత్వ విద్యుత డిస్కం ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్. రాధాకృష్ణ అన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ
కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): చండీఘర్ ప్రభుత్వ విద్యుత డిస్కం ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్. రాధాకృష్ణ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం సుందరయ్య కూడలిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేటుపరం చేయడంలో దూకుడును పెంచిందన్నారు. చండీఘర్ రాష్ట్ర డిస్కమ్‌ను ప్రైవేటు సంస్థ ఎమినెంట్ ఎలకి్ట్రకల్ లిమిటెడ్‌కు అమ్మడానికి డిసెంబరు 4న నోటిఫికేషన జారీ చేసిందన్నారు. చండీఘర్ కార్మికులకు మద్దతుగా నిరసన చేపట్టామన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ఆర్.నరసిం హులు, నాయకులు ప్రభాకర్, మహ్మద్‌రఫి, కే. సుధాకరప్ప, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.