Share News

గొర్రెలు, మేకల పెంపకందారుల సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:42 PM

రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకందారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా గొర్రెలు, మేకల సమాఖ్య అధ్యక్షుడు శ్రీనివాసులు తెలి పారు.

గొర్రెలు, మేకల పెంపకందారుల సంక్షేమమే లక్ష్యం
మాట్లాడుతున్న జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య అధ్యక్షుడు శ్రీనివాసులు

కర్నూలు అగ్రికల్చర్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకందారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా గొర్రెలు, మేకల సమాఖ్య అధ్యక్షుడు శ్రీనివాసులు తెలి పారు. మంగళవారం జిల్లా సమాఖ్య కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం నగరంలోని పశువైద్య బహుళార్ధ సాధక కార్యాలయం ప్రాంగణంలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, కేఈ శ్యాంబాబు, ఫెడరేషన్‌ రాష్ట్ర మాజీ చైర్మన్‌ వై. నాగేశ్వర రావు యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం గతంలో గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుందని, ఇందులో భాగంగా కేంద్ర వెనుకబడిన వర్గాల సంస్థ నుంచి నిధులను తెప్పించిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ నిధులను సక్రమంగా మంజూరు కాకుండా ఎన్నో ఆటంకాలు సృష్టించిందని ఆరోపించారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం సమాఖ్య జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారోత్సవం జరిపించారు. జేడీ శ్రీనివాస్‌, డిప్యూటీ డైరెక్టర్లు దుర్గా ప్రసన్నబాబు, ఏడీలు రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:42 PM