Share News

బొప్పాయి చెట్లను నరికేశారు

ABN , Publish Date - Jun 13 , 2024 | 11:49 PM

మద్దికెర గ్రామంలోని కవిరెడ్డి వీధిలో నివసిస్తున్న కవిరెడ్డి రామక్రిష్ణ అనే రైతు నాలుగెకరాల తోటను ఎకరాకు రూ.20వేల చొప్పున కౌలుకు తీసుకుని బొప్పాయి చెట్లను సాగు చేశాడు.

బొప్పాయి చెట్లను నరికేశారు

మద్దికెర, జూన్‌ 13: మద్దికెర గ్రామంలోని కవిరెడ్డి వీధిలో నివసిస్తున్న కవిరెడ్డి రామక్రిష్ణ అనే రైతు నాలుగెకరాల తోటను ఎకరాకు రూ.20వేల చొప్పున కౌలుకు తీసుకుని బొప్పాయి చెట్లను సాగు చేశాడు. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చెట్లన్నింటినీ నరికవేయడంతో రూ.5 లక్షల దాకా నష్టం వాటిల్లింది. మూడేళ్ల క్రితం రామకృష్ణ మద్దికెర నుంచి కశాపురం వెళ్లే రోడ్డు పక్కన ఉన్న తోటను కౌలుకు తీసుకొని దాదాపు 2,200 బొప్పాయి మొక్కలను నాటాడు. చెట్లు కాపుకు వచ్చాయి. గుర్తు తెలియని వారు బొప్పాయి చెట్లను నరికేశారని బాధితుడు ఆవేదన చెందాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు. మాజీ జడ్పీటీసీ జమేదార్‌ రాజన్న యాదవ్‌, టీడీపీ జిల్లా కార్యదర్శి గూడూరు ధనుంజయుడు, టీడీపీ నాయకులు చంద్రశేఖర్‌ గౌడు, ఎన్‌. లక్ష్మీనారాయణ, రంగయ్య, మాజీ ఎంపీటీసీ డి. శ్రీనివాసులు రైతును కలిసి పరామర్శించారు.

Updated Date - Jun 13 , 2024 | 11:49 PM