Share News

అర్హులందరికీ పింఛన్‌

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:48 PM

ఎన్టీర్‌ భరోసా పింఛన్‌ పథకం కింద జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్‌ పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా తెలిపారు.

అర్హులందరికీ పింఛన్‌
దివ్యాంగురాలికి పింఛన్‌ ఇస్తున్న కలెక్టర్‌

2,39,818 మందికి రూ.102.83 కోట్లు పంపిణీ

కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఎన్టీర్‌ భరోసా పింఛన్‌ పథకం కింద జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్‌ పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా తెలిపారు. మంగళవారం నగరంలోని జొహరాపురంలోని పూల సుబ్బయ్య నగర్‌లో లక్ష్మీదేవికి వికలాంగ పింఛన్‌, రామలక్ష్మికి వితంతువు పింఛన్‌, నాగమణికి ఒంటరి మహిళా పింఛన్‌ వారి ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్‌ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జనవరి 1 నూతన సంవత్సరం కావడంతో ప్రభుత్వం ఒక్కరోజు ముందే పింఛన్‌ పంపిణీ చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సందీ్‌పకుమార్‌, డీఆర్‌డీఏ పీడీ నాగశివలీల పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:48 PM