యువకుడి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:25 AM
మండలంలోని వర్కూరు పొలిమేరలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వేప చెట్టుకు ఉరి వేసుకొని కనిపించినా అది హత్యే అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.
పరిశీలించిన డీఎస్పీ బాబుప్రసాద్
కోడుమూరు రూరల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వర్కూరు పొలిమేరలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వేప చెట్టుకు ఉరి వేసుకొని కనిపించినా అది హత్యే అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. చనుగొండ్ల గ్రామానికి చెందిన ఉప్పరి శ్రీరాములు, రామేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వీరి చిన్నకుమారుడు శివ (26) ఇంటికి సమీపంలో పంక్చర్ షాపు నిర్వహిస్తూ కుటుం బానికి ఆసరాగా ఉంటున్నాడు. శివ అవివాహితుడు కావడంతో రోజూ రాత్రి పూట పంక్చర్ షెడ్‌లో నిద్రిం చేవాడు. అయితే ఆదివారం అమా వాస్య కావడంతో తల్లి రామేశ్వరి దేవుని దర్శనం కోసం వెళ్లింది. తండ్రి శ్రీరాములు కోళ్ల ఫారంలో పనికి కుదరడంతో అక్కడికి వెళ్లాడు. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్తున్న కొందరు షెడ్ పక్కన బైక్ ధ్వంసమైనట్లు గుర్తించారు. షెడ్‌లో శివ లేకపోవడం, గ్రీజ్ మిషన్, హోమ్ థియేటర్ ధ్వంసం కావడం, ఇతర సామగ్రి చిందరవందరగా పడి ఉండడం గమనించారు. దీంతో శివ సోదరులను నిద్రలేపి గూడూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు శివ మొబైల్ లొకేషన్ ట్రాక్ చేసి అందరూ కలిసి వెతికారు. చివరకు గ్రామానికి సుమారు 6 కి.మీ దూరంలో జీడీపీ కెనాల్ పక్కన ఓ పొలంలో వేప చెట్టుకు ఉరికి వేలాడు తున్న శివ మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలిసి డీఎస్పీ బాబుప్రసాద్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిం చారు. డాగ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపారు. ఘటనాస్థలిలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టాయి. తమ కుమారుడిని హత్యచేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఉరివేశారని తల్లిదండ్రులు, సోదరులు ఆరోపించారు. సీఐ తబ్రేజ్, ఎస్‌ఐలు శ్రీనివాసులు, తిమ్మయ్య అధ్వర్యంలో మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.