నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించాలి
ABN , Publish Date - Aug 30 , 2024 | 12:12 AM
నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సిబ్బందిని ఆదేశించారు.
నంద్యాల క్రైం, ఆగస్టు 29 : నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సిబ్బందిని ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజల మధ్య ఉంటూ నేరా లు జరగకుండా చూస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై దృష్టి సారించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌పై పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టంలో వచ్చే ఫిర్యాదుల కు ప్రాధాన్యతనిస్తూ చట్టపరిధిలో నిర్ణీత సమ యంలో పరిష్కరించాలని ఆదేశించారు. పట్టణం, గ్రామాల్లో విద్యాసంస్థలు, ముఖ్యమైన కూడళ్ల వద్ద, పట్టణ శివారులలో నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో మాట్లాడుతూ హైవే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. బ్లాక్‌పాయింట్స్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు, టర్నింగ్‌లు, ముఖ్యమైన ప్రాంతాల్లో సిగ్నల్ బోర్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైవే మొబైల్స్ సహకారంతో హైవేలలో జరిగే దొంగతనాలపై నిఘా ఉంచాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నేరాలు, కమ్యూనల్ గొడవలు జరగకుండా చూడాలని సూచించారు. ఆత్మకూరు సబ్ డివిజన్‌లోని పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండి నివారణ చర్యలతోపాటు ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యపై యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహాలకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు కేసుల వివరాలు తెలుసుకొని దర్యాప్తు వేగిరంగా ముగించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సంతోష్, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, సబ్ డివిజన్‌లోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.