Share News

ఆఖరి మజిలీకి అవస్థలు

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:23 AM

మండల కేంద్రంలోని పందుల కుంట సమీపంలో 53, 57/2, 61బీలో ప్రభుత్వం హిందూ శ్మశానానికి ఐదెకరాలను కేటాయించింది

ఆఖరి మజిలీకి అవస్థలు
శ్మశానంలో ముళ్లకంప, ఇన్‌సెట్‌లో డంప్‌యార్డు

శ్మశాన స్థలంలో డంప్‌యార్డు, ఇళ్లు

దుర్వాసన, ఇరుకు దారితో ప్రజల అవస్థలు

మద్దికెర, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పందుల కుంట సమీపంలో 53, 57/2, 61బీలో ప్రభుత్వం హిందూ శ్మశానానికి ఐదెకరాలను కేటాయించింది. కానీ ఇప్పటికే రెండెకరాలు కబ్జా కాగా, మూడెకరాలు మాత్రమే మిగిలింది. మద్దికెర మేజర్‌ గ్రామ పంచాయతీలో 18 వార్డులు ఉండగా, 20వేల జనాబా ఉంది.

శ్మశానంలో చెత్త..

అయితే శ్మశాన వాటికలోనే చెత్తను డంపింగ్‌ చేస్తున్నారు. దీంతో దహన సంస్కారాలకు వచ్చినవారు ఇబ్బందులు పడుతున్నారు. శ్మశాన స్థలంలో ముళ్ల కంప ఉండ టంతో వాటిని తొలగించి మృతదేహాలను పూడ్చుతు న్నారు.

రోడ్డుకు ఇరువైలా చెత్త..

దారిలో రోడ్డుకిరువైపులా చెత్త ఉండటంతో అంత్యక్రి యలకు వెళ్లేవారికి ఇబ్బంది కలుగుతుంది. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ముళ్లకంప ఉండటంతో దారి మూసుకు పోయింది. ఎక్కడ అంత్యక్రియలు చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

శ్మశానంలో గృహాలు

శ్మశాన స్థలంలో రెండెకరాల్లో కబ్జా చేసి గృహాలు నిర్మించుకున్నారు. స్థలం కబ్జా అవుతోందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు మరింత ముందుకు వస్తున్నారు. దారిలో రాళ్లు అడ్డంగా పెట్టడంతో నడవలేని పరిస్థితి ఉంది. ఆఖరి మజీలీలో కూడా ప్రశాంతంగా లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి శ్మశాన స్థలం కబ్జా కాకుండా చూడాలని, డంపింగ్‌ యార్డును ఇతర ప్రాంతాలనికి తరలించాలని కోరారు.

ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి శివకుమార్‌ను వివరణ కోరగా డంపింగ్‌ యార్డును తరలించడానికి స్థలం సేకరిస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు

చెత్తను తొలగించాలి

శ్మశానంలో చెత్తతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అంత్యక్రి యలకు వెళ్లిన సమయంలో పొగ వస్తుంది. చెత్తను తొలగించాలి - రమేష్‌, మద్దికెర

Updated Date - Nov 19 , 2024 | 01:23 AM