Share News

ఊపిరి తీసుకోవడమే కష్టం

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:13 AM

క్రానిక్‌ అబ్జెక్టివ్‌ పల్మొనరీ డిసీజ్‌ (సీవోపీడీ) అనేది ఊపిరితిత్తుల వ్యాధి. సీవోపీడీ సమస్యల్లో క్రానిక్‌ బ్రాంకైటీస్‌, ఎంఫెసెమా రకాలు కనబడుతాయి.

ఊపిరి తీసుకోవడమే కష్టం

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): క్రానిక్‌ అబ్జెక్టివ్‌ పల్మొనరీ డిసీజ్‌ (సీవోపీడీ) అనేది ఊపిరితిత్తుల వ్యాధి. సీవోపీడీ సమస్యల్లో క్రానిక్‌ బ్రాంకైటీస్‌, ఎంఫెసెమా రకాలు కనబడుతాయి. ఏటా నవంబరు మూడో బుధవారం వరల్డ్‌ సీవోపీడీ డే ను నిర్వహిస్తున్నారు. ప్రతి ముగ్గురు స్మోకర్స్‌లో ఒకరికి ఈ జబ్బు వస్తుంది. సీవోపీడీపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు డబ్ల్యూహెచ్‌వో ఈ ఏడాది ‘‘మీ ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకోండి’’.. అన్న నినాదాన్ని ఇచ్చింది.

ఉమ్మడి జిల్లాలో సీవోపీడీ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. పదేళ్ల క్రితం జనాభాలో 3 శాతం కంటే ఈ వ్యాధి ఇప్పుడు 8 శాతానికి పెరిగింది. సీవోపీడీ వ్యాధిగ్రస్థుల్లో 65 శాతం పొగతాగే అలవాటు ఉన్న వారే ఉన్నారు. మిగిలిన బాధితులు పరిశ్రమల్లో దుమ్మూ, ధూళి, పొగ, కాలుష్య రసాయనాల మధ్య పనిచేసే వారు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని డోన్‌, బేతంచెర్ల, బనగానపల్లె, అవుకు, కర్నూలు పారిశ్రామిక ప్రాంతాల్లో సీవోపీడీ బాధితులు అధికంగా ఉన్నారు. ఇక కర్నూలు జీజీహెచ్‌లోని ఊపిరితిత్తుల వార్డుకు ప్రతిరోజు ఓపీ కేసులు 120 దాకా ఉంటాయి. వీరిలో 50 శాతం సీవోపీడీ బాదితులు వస్తుంటారు. వీరికి ఇన్‌హెలర్స్‌, యాంటి బయాటిక్స్‌ మందులు ఇచ్చి చికిత్స అందిస్తున్నారు.

చికిత్స

మందుల కన్నా ముందు కౌన్సి లింగ్‌ బాలా అవసరం. పొగతాగడం మానేయాలి. బ్రాంకో డైలేటర్స్‌, ఇన్‌హెలర్స్‌, స్టెరాయిడ్స్‌ ఛాతీ వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. ఆక్సిజన్‌ ధెరపీ దీర్ఘకాలికంగా రోజుకు కనీసం 15 గంటలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల వ్యాయామం, ప్రాణాయా మం, లంగ్‌ మార్పిడీ చేయించుకోవాలి. ఇన్‌ఫ్లూయోం జీ వ్యాక్సిన్‌, న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌ను ఇప్పించాలి.

వ్యాధి లక్షణాలు

ఆయాస పడడం, దగ్గు..

ఛాతి బిగుసుకుపోవడం

శ్వాసలో గురగుర శబ్దాలు

పనులు చేసుకోలేకపోవడం

సీవోపీడీ దీర్ఘకాలిక జబ్బు

సీవోపీడీ ఒక దీర్ఘకాలిక జబ్బు. ఇది బీడీ, సిగరెట్‌ తాగే వారిలో 90 శాతం జబ్బు వస్తుంది. ఎక్కువగా 40ఏళ్ల పైబడిన వారిలో కనిపిస్తుంది. వరల్డ్‌ సీవోపీడీ డేను పురస్కరించుకుని నగరంలోని న్యూనాగిరెడ్డి రెవెన్యూ కాలనీ శ్రీసాయి చెస్ట్‌ అండ్‌ అలర్జీ క్లీనిక్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచితంగా స్పైరో మెట్రి పరీక్షలు నిర్వహించనున్నాం. - డా.జి. కుళ్లాయప్ప, ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణుడు

Updated Date - Nov 20 , 2024 | 12:13 AM