ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:43 AM
ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి అధి కారు లను ఆదేశించారు.
ఓర్వకల్లు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి అధి కారు లను ఆదేశించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలకు ఆమె హాజర య్యారు. ట్రైనీ కలెక్టర్ తోపాటు తహసీల్దార్ విద్యాసాగర్ ప్రజల నుంచి వినతులను స్వీకరిం చారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీ డీవో శ్రీనివాసులు అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో ఈవో ఆర్‌డీ సుబ్బరాయుడు, ఇంజనీర్లు శ్రీనివాసులు, రామయ్య, సురేంద్ర నాథ్, ఏపీఎం వెంకట్రామిరెడ్డి, ఏపీవో కుమారసాయినాథ్, సర్వే యర్ శంకర్ మాణిక్యం, వీఆర్వోలు పాల్గొన్నారు.