Share News

రమణీయం.. శివపార్వతుల రథోత్సవం

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:51 AM

మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో శివపార్వతుల రథోత్సవం వైభంగా నిర్వహించారు.

రమణీయం.. శివపార్వతుల రథోత్సవం
శివపార్వతుల రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

మంత్రాలయం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో శివపార్వతుల రథోత్సవం వైభంగా నిర్వహించారు. సోమవారం రాత్రి కార్తీకమాస పూజలను పురస్కరించుకుని శివపార్వతులకు, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆంజనేయస్వామిని, శివపార్వతులను రథంపై ఏర్పాటుచేసి గ్రామవీధుల గుండా గొరవయ్యల నృత్యాలు, మంగళవాయిద్యాలు, డీజేల మధ్య టపాసులు కాలుస్తూ ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధగ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రాలయం సీఐ రామాం జులు, మంత్రాలయం, మాధవరం ఎస్‌ఐలు పరమేష్‌ నాయక్‌, విజయకుమార్‌, పోలీ సు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వీరాంజనేయులు భాస్కర్‌, గురు మూర్తి, సర్పంచ ముకురన్న, రోగెప్ప, రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:51 AM