Share News

రమణీయం.. రాఘవేంద్రుడి స్వర్ణ పల్లకి సేవ

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:04 AM

మంత్రాలయంలో రాఘవేంద్రుడి స్వర్ణ పల్లకి సేవ రమణీయంగా నిర్వహించారు. రాఘవేంద్రస్వామి బృందావన ప్రతిమను స్వర్ణపల్లకిలో ఉంచి వైభవంగా ఊరేగించారు.

రమణీయం.. రాఘవేంద్రుడి స్వర్ణ పల్లకి సేవ
స్వర్ణపల్లకిలో విహరిస్తున్న రాఘవేంద్రుడు

మంత్రాలయం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): మంత్రాలయంలో రాఘవేంద్రుడి స్వర్ణ పల్లకి సేవ రమణీయంగా నిర్వహించారు. రాఘవేంద్రస్వామి బృందావన ప్రతిమను స్వర్ణపల్లకిలో ఉంచి వైభవంగా ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ చేశారు. కార్తీక శుద్ద త్రయోదశిని పురస్కరించుకుని గురువారం మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు కార్తీక దండకా స్నానం ఆచరించారు. అనంతరం తడి దుస్తులతో రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు గురువారం పోటెత్తారు. మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిర్సింది. ప్రత్యేక ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు.

మంత్రాలయంలో హుబ్లీ పీఠాధిపతి

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్నాటకలోని హుబ్లీ ఆదిశంకరాచార్య అద్వైత మఠం పీఠాధిపతి శివానంద భారతి తీర్థులు గురువారం మంత్రాలయం వచ్చారు. స్వామిజీకి మఠం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అదేవిధంగా రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ శివశంకర్‌ అమరన్న సతీ సమేతంగా గురువారం మంత్రాలయం వచ్చారు. మహాముఖ ద్వారం వద్ద మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు వెంటేష్‌ జోషి, శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహమూర్తి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆశీర్వదించారు. వీరి వెంట తహసీల్దార్‌ ఎస్‌ రవి, ఎస్‌ఐ పరమేష్‌ నాయక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:04 AM