Share News

రమణీయం.. వెండి గజ వాహనోత్సవం

ABN , Publish Date - Dec 20 , 2024 | 12:35 AM

ప్రహ్లాదరాయలు వెండి గజ వాహనంపై విహరించారు.

రమణీయం.. వెండి గజ వాహనోత్సవం
గజ వాహనంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రహ్లాదరాయలు వెండి గజ వాహనంపై విహరించారు. రాఘవేంద్రస్వామి సజీవ సమాధి పొందిన గురువారం శుభదినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ప్రహ్లాదరాయలకు పాద పూజ చేసి పల్లకిలో ఊరేగించారు. పీఠాధిపతి మూలరాములకు బంగారు నాణేలతో అభిషేకించి హారతులు ఇచ్చారు. అనంతరం వెండి గజవాహనంపై బంగారు అంబారిలో స్వామివారిని ఏర్పాటు చేసి భక్తుల జయధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజల సేవ భక్తులను ఆకట్టుకుంది. రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం కోలాహలంగా మారింది.

Updated Date - Dec 20 , 2024 | 12:35 AM