Share News

రేషన్‌ బియ్యం సీజ్‌

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:16 AM

పట్టణానికి చెందిన ఓ యువనాయకుడి బియ్యం దందా ఒక్కొక్కటిగా బయట పడుతోంది. పేదలకందే బియ్యాన్ని ఇతర రాష్ర్టాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

రేషన్‌ బియ్యం సీజ్‌
పట్టుబడ్డ రేషన్‌ బియ్యంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు

ఓ యువనాయకుడి దందాకు సీఐ అండదండలు!

పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ

రంగంలోకి స్పెషల్‌ బ్రాంచ్‌

ఆదోని రూరల్‌ నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పట్టణానికి చెందిన ఓ యువనాయకుడి బియ్యం దందా ఒక్కొక్కటిగా బయట పడుతోంది. పేదలకందే బియ్యాన్ని ఇతర రాష్ర్టాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాకు ఓ సీఐ అండదండలు ఉన్నాయని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌కు సమాచారం రావడంతో రెవెన్యూ అధికారులు దాడు లు నిర్వహిం చారు. దీంతో ఆంధ్ర జ్యోతిలో రేషన్‌ బియ్యం, సీజ్‌, ఎమ్మెల్యే అనుచరు డినే గుర్తింపు శీర్షికన కథనం ప్రచురితం అయిన విషయం విధితమే. స్పందించిన ఎస్పీ బిందు మాధవ్‌ ఆదోని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసుల సమాచారం మేరకు రెవెన్యూ, పోలీసులు శనివారం రాత్రి 10 గంటలకు బియ్యం డాన్‌ సొంత గ్రామం సంతేకూడ్లురు సమీపంలోని బలాదూ ర్‌లోని యడవలి పాండు నివాసంలో దాడులు నిర్వహించి 30 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాఽధీనం చేసుకున్నారు. పోలీసులు, అధికా రులు దాడుల సమాచారం తో బియ్యం దొంగలు పరారయ్యారు. ఈ బియ్యం మొత్తం ఎమ్మెల్యే అనుచరుడు సంతేకూడ్లరు మధువే నని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఇస్వి ఎస్‌ఐ నాగేంద్ర, ఆర్‌ఐ కాశీమ్‌, వీఆర్‌వోలు ఈరన్న, రాజశేఖర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 12:16 AM