రబీ సాగుకు సన్నద్ధం!
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:23 AM
గాజులదిన్నె ప్రాజెక్టు కింద రబీ సాగుకు రైతులు, ఇంజనీర్లు సన్నద్ధం అవుతున్నారు. రబీ సీజన్‌లో 15 వేల ఎకరాకలకు సాగునీరు ఇవ్వాలని ఐఏబీ సమావే శంలో తీర్మానించారు.
జీడీపీ కింద 15 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని ఐఏబీ తీర్మానం
నేటి నుంచి కాలువలకు నీటి విడుదల
సన్నాహాలు చేస్తున్న ఇంజనీర్లు
గేట్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టిన ఇంజనీర్లు
కర్నూలు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు కింద రబీ సాగుకు రైతులు, ఇంజనీర్లు సన్నద్ధం అవుతున్నారు. రబీ సీజన్‌లో 15 వేల ఎకరాకలకు సాగునీరు ఇవ్వాలని ఐఏబీ సమావే శంలో తీర్మానించారు. గతేడాది తాగునీటి అవస రాలు దృష్ట్యా సాగునీరు ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది తప్పకుండా రైతు లకు సాగునీరు ఇవ్వాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పట్టుబట్టారు. ఆ దిశగా ఇంజీనర్లు కూడా సాగు ప్రణాళికలను సిద్ధం చేశారు. మంగ ళవారం పంట కాలు వలకు ఎమ్మెల్యే బీవీ సాగునీరు విడుదల చేసా ్తరని ఎల్లెల్సీ ఈఈ శైలేశ్వర్ ఆంధ్రజ్యోతికి వివరించారు. అదే క్రమంలో గత వైసీపీ ప్రభు త్వంలో బిల్లులు కాక ఆగిపోయిన ఆనకట్ట ఎత్తు పెంచడం, నూతన క్రస్‌గేట్లు ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జీడీపీ జలాశయం ద్వారా గోనెగండ్ల, కోడుమూరు, కృష్ణగిరి, దేవనకొండ మండలాల్లో 21 గ్రామాలకు రబీ సీజన్‌లో 25,454 ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. డోన్, కృష్ణగిరి, బండగట్టు తాగునీటి పథకాల ద్వారా డోన్ పట్టణం సహా వివిధ గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తు న్నారు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా.. సోమవారం నీటి లెక్కలు కొలిచే సమయానికి 2.79 టీఎంసీల నిల్వ ఉంది. 40 క్యూసెక్కులు హంద్రీనీవా కాలువ నుంచి వచ్చి చేరుతోంది. డెడ్ స్టోరేజీ పోను 2.14 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం (లైవ్ స్టోరేజీ) ఉంది. నవంబరు 26న కలెక్టరు పి.రంజిత్‌బాషా అధ్యక్షతన జరిగిన రబీ ఐఏబీ సమావేశంలో 15 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సాగు కోసం 1.50 టీఎంసీలు అవసరం ఉంది. అయితే.. నీటి లభ్యత దృష్ట్యా 12-13 వేల ఎకరాలకు తగ్గకుండా సాగు నీరు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మంగళవారం ఎమ్మిగ నూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి కాలువలకు సాగునీరు విడుదల చేయనున్నారు. గతేడాది తాగునీటి అవస రాల దృష్ట్యా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేదు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఆ పరిస్థితి తలెత్త కుండా ముందస్తు ప్రణాళికతో సాగునీరు ఇచ్చేలా సన్నాహాలు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హంద్రీ నీవా నీటిని తీసుకుంటేనే..
జీడీపీ ద్వారా సాగు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలంటే హంద్రీనీవా కాలువ, తుంగభద్ర దిగువ కాలువ నుంచి జీడీపీకి నీటిని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి ద్వారా 12-13 వేల ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాలకు తాగునీరు ఏప్రిల్ వరకు ఎలాంటి సమస్య తలెత్తకుండా ఇవ్వవచ్చు. మే, జూన్ నెలల్లో నీటి సమస్యను అధిగమించాలంటే హంద్రీనీవా కాలువ ద్వారా రోజుకు 300 క్యూసెక్కులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా వంద క్యూసెక్కులు విడుదల చేస్తే జీడీపీకి 40 క్యూసెక్కులు చేరుతున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంకు కృష్ణా జలాలు తీసుకెళ్లాలనే లక్ష్యంగా గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటి విడుదలను ఆపేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే బీవీ జోక్యం చేసుకొని హంద్రీనీవా ఇంజనీర్లతో మాట్లాడి 300 క్యూస్కెలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఎల్లెల్సీ పరిధిలో వరి కోతలు ఉన్నాయి. ఎల్లెల్సీ నీటిని కూడా జీడీపీకి మళ్లించి నిల్వ చేస్తే మే, జూన్ నెలల్లో కూడా సమస్య తలెత్తకుండా నీటిని సరఫరా చేయవచ్చు.
క్రస్ట్‌గేట్ల ఏర్పాటు పనులు ప్రారంభం
ఆగిపోయిన క్రస్ట్‌గేట్ల ఏర్పాటు పనులకు ఎట్టకేల కు శ్రీకారం చుట్టారు. జీడీపీ సామర్థ్యం 4.50 టీఎంసీలు నుంచి 5.50 టీఎంసీల సామర్థ్యం పెంపు, తప్పు పట్టి పాడైపోయిన క్రస్ట్‌గేట్లు స్థానంలో నూతన క్రస్ట్‌గేట్లు ఏర్పాటు పనులు వైసీపీ ప్రభుత్వ హ యాంలో చేపట్టారు. రూ.35 కోట్లతో ఆనకట్టు ఎత్తు పెంచే పనులు, రూ.12 కోట్లతో కొత్త క్రస్ట్‌గేట్లు ఏర్పాటు పనులు చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు ఇవ్వక పోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. అసంపూర్తి పనులపై ఆంధ్రజ్యోతి పలు కథనాలు ద్వారా వెలుగులోకి తెచ్చింది. ఎమ్మెల్యే
బీవీ జీడీపీ ఇంజనీర్లు, కాంట్రాక్టరుతో చర్చించి ఆగస్టులోనే కొత్తగా నాలుగు గేట్లు ఏర్పాటు చేశారు. మరో రెండు గేట్లు ఏర్పాటు పనులు చురుగ్గా జరుగుతు న్నాయి. కాంట్రాక్టర్‌కు బకాయి బిల్లులు చెల్లించి అసంపూర్తి పనులు పూర్తి చేయించి ఆయకట్టుకు సాగు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
15 వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయం
జీడీపీ కింద రబీలో 15 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఐఏబీలో నిర్ణయం తీసుకున్నారు. పంట కాలువలకు నేడు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి చేత విడుదల చేయించేందుకు ఏర్పాట్లు చేశాం. రైతులకు సాగునీరు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఆరు క్రస్ట్‌గ్డేట్లలో నాలుగు కొత్త గేట్లు ఏర్పాటు చేశాం. మరో రెండు గేట్లు ఏర్పాటు పనులు మొదలు పెట్టాం. - శైలేశ్వర్, ఈఈ, టీబీపీ ఎల్లెల్సీ డివిజన్, ఆదోని