Share News

రాత్రికి రాత్రే రికార్డులు మార్చేశారు

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:05 AM

గత వైసీపీ ఐదేళ్ల పాలనలో అధికారులను బెదిరించి రాత్రికి రాత్రే రెవెన్యూ రికార్డులు మార్చారని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

రాత్రికి రాత్రే రికార్డులు మార్చేశారు
మాట్లాడుతున్న రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ

రైతులను బెదిరించి తమ పేర్లపై రిజిస్ట్రేషన్లు

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపణలు

పార్టీలకతీతంగా రైతుల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

బనగానపల్లె, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ఐదేళ్ల పాలనలో అధికారులను బెదిరించి రాత్రికి రాత్రే రెవెన్యూ రికార్డులు మార్చారని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం యాగంటి పల్లెలో మీభూమి మీహక్కు పేరుతో జేసీ విష్ణుచరణ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. బీసీ మాట్లాడుతూ రైతులు సమర్పించిన భూ వివాదాలకు సంబంధించి అందించిన అర్జీలను 45 రోజుల్లో పరిష్కరించనున్నట్లు తెలిపారు. భూ వివాదాలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత పాలనలో కాటసాని రామిరెడ్డి ఇంట్లో రెవెన్యూ శాఖకు చెందిన కంప్యూటర్‌ ఆపరేటర్లు పని చేశారంటే వారి పాలనను అర్థం చేసుకోవచ్చన్నారు. 70 శాతం రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. రైతులను బెదిరించి తమ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని తెలిపారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, గ్రామస్థులు గ్రామ సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి, గ్రామ సచివాలయ సిబ్బం, గ్రామ వైసీపీ నాయకుడిపై ఫిర్యాదులు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో నరసింహులు, జిల్లా డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, నియోజకవర్గం స్పెషల్‌ అధికారి రాంభూపాల్‌రెడ్డి, స్థానిక తహసీల్దారు నారాయణరెడ్డి, టీడీపీ నాయకులు బండికుమార్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, దస్తగిరి, పాతపాడు సర్పంచ్‌ మహేశ్వరరెడ్డి, బత్తుల బాలిరెడ్డి, బత్తుల గోపాల్‌రెడ్డి, కృష్ణానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:05 AM