Share News

బియ్యం వ్యాపారుల దౌర్జన్యం

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:37 AM

ఎమ్మెల్యే పార్థసారధి అనుచరుల అక్రమాలకు, దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది

బియ్యం వ్యాపారుల దౌర్జన్యం
తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఉన్న బియ్యం ఆటో

ఆటో డ్రైవర్లపై ఎమ్మెల్యే అనుచరుల పెత్తనం

ఆదోని రూరల్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే పార్థసారధి అనుచరుల అక్రమాలకు, దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఫోర్జరీ సంతకాలతో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఆదోని నడిబొడ్డున ఏస్కేడి కాలనీలో రూ.2 కోట్లు విలువ చేసే ఆరు సెంట్ల స్థలాన్ని కబ్జా చేసిన కథనం మరవకముందే మరో అనుచ రుడు సంతేకుడ్లూరు మధు అక్రమ బియ్యం దందాకు తెర తీశాడు. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు ఆటోడ్రైవర్లు వ్యాపారులు అక్రమంగా సేకరించిన బియ్యాన్ని తరలిస్తుండేవారు. ప్రస్తుతం సిండికేట్‌గా మారడంతో కూలీ ఇవ్వడం లేదని ఆటోడ్రైవర్లు ఎమ్మిగనూరుకెళ్లి వ్యాపారాన్ని కొనసా గిస్తున్నారు. అయితే ఆదివారం ఇద్దరు ఆటోడ్రైవర్లు ఆదోనిలో ప్రజల ద్వారా కొనుగోలు చేసిన 20 ప్యాకెట్ల బియ్యాన్ని ఆటోలో వేసుకొని ఎమ్మిగ నూరుకు తీసుకెళ్లారు. ఎమ్మిగనూరులో కొనుగోలు చేసిన బియ్యాన్ని మిలటరీ కాలనీలో ఆటోలో వేస్తుండగా, బియ్యం డాన్‌ సంతేకు డ్లూరు మధు అనుచరులు 15మంది చేరుకొని ఆటో డ్రైవర్లతో ఘర్షణకు దిగారు. ఆదోని బియ్యాన్ని ఎమ్మిగనూ రుకు ఎలా తరలిస్తారని ఆదోనికి తరలించారు. వైపీఆర్‌ టౌన్‌షిప్‌ వద్ద గౌడైన్‌లో 18ప్యాకెట్ల బియ్యాన్ని దించి రెండు ప్యాకెట్లను ఆటోలో ఉంచి తాలుకా పోలీసులకు ఆటోను అప్పగిం చారు. ఎస్‌ఐ రామాంజనే యులును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, సిబ్బంది ఆటోను అదుపులో తీసుకున్న మాట వాస్తవమేనన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:37 AM