Share News

శ్రీశైలానికి సీప్లేన్‌

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:45 AM

శ్రీశైలం ఓ అద్భుత ఘట్టానికి వేదికగా నిలిచింది. అధునాతన టెక్నాలజీతో కూడిన సీ ప్లేన్‌ ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.

శ్రీశైలానికి సీప్లేన్‌
సీ ప్లేన్‌లో చంద్రబాబు

మొదటి ప్రయాణం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు

నంద్యాల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఓ అద్భుత ఘట్టానికి వేదికగా నిలిచింది. అధునాతన టెక్నాలజీతో కూడిన సీ ప్లేన్‌ ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ఇక మీదట మల్లన్న సన్నిధికి చేరుకునే భక్తులకు ప్రయాణం వేగవంతం, సులభతరం కానుంది. శనివారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి ఎగిరిన సీ ప్లేన్‌ శ్రీశైలం జలాశయం బ్యాక్‌ వాటర్‌పై మధ్యాహ్న ఒంటిగంట సమయంలో ల్యాండ్‌ అయింది. నీటిని చిమ్ముకుంటూ.. చీల్చుకుంటూ వచ్చిన సీ ప్లేన్‌ జెట్టీ దగ్గర ఆగింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజాప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోనే మొదటి సీ ప్లేన్‌ సర్వీసు కాగా ఇందులో ప్రయాణించిన మొదటి వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు. సీప్లేన్‌లో 40 నిమిషాల్లోనే విజయవాడ నుంచి శ్రీశైలానికి చేరుకోవచ్చు. ప్రస్తుత ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సీ ప్లేన్‌ సర్వీసు మార్చి నుంచి అందుబాటులోకి రానుంది.

శ్రీశైలం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాంతం తిరుమల తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలాగే పచ్చని ప్రకృతితో నిండి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దోర్నాల నాగార్జున సాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఉంది కాబట్టి టూరిజాన్ని అభివృద్ధి పరిచేలా అనేక రకాల కార్యక్రమాలను చేపట్టవచ్చన్నారు. అలాగే తుమ్మలబయలులో నల్లమల జంగిల్‌ సఫారీ, టైగర్‌ రిజర్వ్‌లో టైగర్‌ సఫారి చేయవచ్చన్నారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ఓ మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేస్తామన్నారు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పనులు చేపడతామన్నారు.

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను శనివారం సీఎం నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘సీ మీట్స్‌ స్కై’ పేరుతో చేపట్టిన విజయవాడ-శ్రీశైలం మధ్య సీప్లేన్‌ సర్వీసును శనివారం ఉదయం విజయవాడ పున్నమి ఘాట్‌ వద్ద లాంఛనంగా ప్రారంభించారు. తరువాత సీప్లేన్‌ ద్వారా శ్రీశైలం పాతాళగంగ ల్యాండింగ్‌ పాయింట్‌కు వచ్చారు. అక్కడి నుంచి రోప్‌ వే ద్వారా ఎంట్రీ పాయింట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌ ద్వారా స్వామి, అమ్మవార్ల ప్రధానాలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్దకు చేరుకున్నారు. దర్శనార్థం ప్రధానాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కమిషనరు ఎస్‌. సత్యనారాయణ పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు బ్యాటరీ వాహనంలో ఆలయ రాజగోపురానికి చేరుకోగా ఆలయ అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తరువాత ఆయన స్వామివారి ఆలయ ప్రాంగణంలోని రత్న గర్భగణపతి స్వామిని దర్శించుకుని మల్లికార్జున స్వామివారికి అభిషేకం చేశారు. స్వామివారి దర్శనానంతం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆ తరువాత భ్రమరాంబికాదేవి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో ముఖ్యమంత్రి చంద్రబాబును అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వామి, అమ్మవార్ల జ్ఙాపిక, స్వామి, అమ్మవార్ల ప్రసాదాలను అందించారు. సీఎం వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు ఉన్నారు.

మల్లన్న సేవలో చంద్రన్న

శ్రీశైలంలో సీఎంకు ఘన స్వాగతం

స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న చంద్రబాబు

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను శనివారం సీఎం నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల ప్రధానాలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కమిషనరు ఎస్‌. సత్యనారాయణ పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు బ్యాటరీ వాహనంలో ఆలయ రాజగోపురానికి చేరుకోగా ఆలయ అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తరువాత ఆయన స్వామివారి ఆలయ ప్రాంగణంలోని రత్న గర్భగణపతి స్వామిని దర్శించుకుని మల్లికార్జున స్వామివారికి అభిషేకం చేశారు. స్వామివారి దర్శనానంతం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆ తరువాత భ్రమరాంబికాదేవి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. దర్శన అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో చంద్రబాబును అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వామి, అమ్మవార్ల జ్ఙాపిక, స్వామి, అమ్మవార్ల ప్రసాదాలను అందించారు. సీఎం చంద్రబాబు వెంట రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు ఉన్నారు.

‘పర్యాటక రంగానికి శ్రీశైలం అనుకూల ప్రదేశం. ఇక్కడి తుమ్మలబయలులో టైగర్‌ సఫారికి అవకాశం ఉంది. వన్యప్రాణులు, పులులు, చిరుతలకు నల్లమల అభయారణ్యం సురక్షిత ప్రదేశం. ఇక శ్రీశైలం డ్యాం ఒక అద్భుతం. డ్యాం గేట్లు ఎత్తినప్పుడు ఆ దృశ్యాలను చూడటానికి ప్రజలు ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడి ప్రసిద్ధి చెందిన అక్కమహాదేవి గుహల్లో ట్రెక్కింగ్‌, ఽధ్యానం చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇష్ట కామేశ్వరి దేవి, సాక్షి గణపతి క్షేత్రాలు కూడా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తాం.’

- సీఎం చంద్రబాబు నాయుడు

Updated Date - Nov 10 , 2024 | 12:45 AM