వెండి వస్తువుల బహూకరణ
ABN , Publish Date - Mar 22 , 2024 | 12:18 AM
శ్రీశైలం దేవస్థానానికి కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన వల్లభనేని రామరావు, కృష్ణకుమారి దంపతులు గురువారం వెండి పూజా సామగ్రిని సమర్పించారు.
శ్రీశైలం, మార్చి 21: శ్రీశైలం దేవస్థానానికి కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన వల్లభనేని రామరావు, కృష్ణకుమారి దంపతులు గురువారం వెండి పూజా సామగ్రిని సమర్పించారు. స్వామి, అమ్మవార్ల కైంకర్యాలలో వీటిని వినియోగించేందుకు అందజేసినట్లు భక్తులు తెలిపారు. వీటిలో 740 గ్రాముల వెండి బిందె, 390 గ్రాముల రెండు వెండి ప్రమిదలు, 150 గ్రాముల వెండి ప్లేటు, రెండు 160 గ్రాముల వెండి అక్షిత గిన్నెలు, 35 గ్రాముల అగరుబత్తి స్టాండ్ అందజేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం లోని ఆశీర్వచన మండపంలో భక్తులు వీటిని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందజేశారు. వీరికి దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.