Share News

సీబీజీ ప్లాంట్‌కు స్థల పరిశీలన

ABN , Publish Date - Sep 21 , 2024 | 01:23 AM

గార్గేయపురం డంప్‌ యార్డులో ఏర్పాటు చేయనున్న కంప్రెస్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ (సీబిజీ) స్థలాన్ని కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు శుక్రవారం పరిశీలించారు.

సీబీజీ ప్లాంట్‌కు స్థల పరిశీలన
సీబీజీ ప్లాంట్‌కు స్థలాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌

కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 20: గార్గేయపురం డంప్‌ యార్డులో ఏర్పాటు చేయనున్న కంప్రెస్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ (సీబిజీ) స్థలాన్ని కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రతి ఏటా టన్నుల కొద్ది వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండటంతో భూమి కలుషితమై పోతుందన్నారు. దానికి పరిష్కారంగా చెత్త నుంచి బయోగ్యాస్‌ తయారు చేసే సీబీజీ ప్లాంట్‌ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట ఆరోగ్య అధికారి కే.విశ్వేశ్వరరెడ్డి, ఎంఏ షాకీర్‌, ఏఈ దినేష్‌, టౌనప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ శబరీష్‌ ఉన్నారు.

ఫ నగరంలోని పలు వీధుల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని కమి షనర్‌ రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. పాతబస్టాండులో అధి కారులతో కలిసి పర్యటించారు. ఆయా ప్రాంతాలలో పూడికతీత పనులు చేపట్టాలని, మురుగు కాల్వల్లో అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని, ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు.

Updated Date - Sep 21 , 2024 | 01:23 AM