Share News

భూ సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:08 AM

భూ సమస్యలకు శాశ్వత పరి ష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నదని కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా అన్నారు.

భూ సమస్యలకు పరిష్కారం
మాట్లాడుతున్న కలెక్టర్‌, పాల్గొన్న ఎమ్మెల్యే

కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా

కల్లూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యలకు శాశ్వత పరి ష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తున్నదని కలెక్టర్‌ పి. రంజిత్‌బాషా అన్నారు. శుక్రవారం కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామ సదస్సుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, జేసి బి. నవ్య హాజరయ్యారు. ముందుగా రాజ్యాంగ రూపకర్త డా.బిఆర్‌. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 472 గ్రామాలు ఉన్నాయని అందులో 250 గ్రామాల్లోనే రీ సర్వే పూర్తయిందని, మిగతా గ్రామాల్లో కూడా రీ సర్వే చేయాల్సి ఉందని అన్నారు. రీ సర్వే జరిగిన..జరగని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు జనవరి 8 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీఓ సందీప్‌కుమార్‌, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ ఆఫీసర్‌ దీప్తి, కల్లూరు తహసీల్దారు కె. ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రామాంజనేయులు, 36వ వార్డు టీడీపీ నాయకుడు ఆర్‌. తిరుమలేశ్వరరెడ్డి పెద్దబాచుపల్లి, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:08 AM