అర్జీలు డిసెంబరు 31లోపు పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:39 AM
ఆదోని డివిజన్ రీ సర్వే అర్జీలను డిసెంబరు 31లోపు పరిష్కరించాలని కలెక్టర్ రంజిత్ బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రంజిత్ బాషా
ఆదోనిలో అధికారులతో సమీక్ష
ఆదోని, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆదోని డివిజన్ రీ సర్వే అర్జీలను డిసెంబరు 31లోపు పరిష్కరించాలని కలెక్టర్ రంజిత్ బాషా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదోనిలో డివిజనల్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్‌లో 7,482 పిటిషన్లు ఉండగా, వీటిని ఎస్‌ఓపి ప్రకారం పరిష్కరించాలన్నారు.
తహసీల్దార్లు క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరిం
చాలని, స్వయంగా వెళ్లి మ్యుటేషన్ కేసులను పరిష్కరిం చాలని, భూసేకరణను వేగవంతం చేయాలని చెప్పారు. పబ్లిక్ గ్రీవెన్స్‌లో పెండింగ్‌లో ఉన్న 9 రీ ఓపెన్ కేసులు, 4 సీఎంవో గ్రీవెన్స్ తక్షణమే పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల కుల ధ్రువీకరణ వెంటనే పంపాలని సూచించారు.
విభిన్న శాఖల పురోగతిపై దృష్టి
నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ కింద రూ.10లక్షల విలువైన 2 గొర్రెల యూనిట్లను లభ్ధిదారులతో ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలకు సూచించారు. క్రాప్ బుకింగ్ ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. సీసీఆర్‌సీ కార్డుల ప్రగతి 81.51 శాతంగా ఉండగా, 100ు లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పెండింగ్ పనులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దకడుబూరు, నందవరం, గోనెగండ్ల మండలాల్లో సీసీ రోడ్లు, డ్రిప్ ఇరిగేషన్, ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. చెత్త సంపద తయారీ కేంద్రాలు, హార్టికల్చర్, గోకులం పనులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. పీఆర్ వన్ యాప్‌లో ట్యాంకుల క్లోరినేషన్, అపార్ కార్డు జనరేషన్ పై ప్రగతి సాధించాలని సూచించారు.
విద్య, వైద్య శాఖలపై ప్రత్యేక దృష్తి
పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాస్‌లు నిర్వహిం చాలని, వెనకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆధార్‌లో తప్పులను సరి చేయడంలో తహసీ ల్దార్లు సహకరించాలన్నారు. గర్భిణుల నమోదులో వందశా తం పురోగతి సాధించాలని ఆదేశించారు. జేసీ నవ్య, సబ్ కలెక్టర్ మౌర్య, డీఆర్‌వో వెంకట నారాయణమ్మ పాల్గొన్నారు.
రూ.14 కోట్లతో గాల్వోనియం షెడ్
వ్యవసాయ మార్కెట్ యార్డులో పంట ఉత్పత్తులు తడవకుండా రూ.14 కోట్లతో గాల్వోనియం షెడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం వ్యవసాయ మార్కెట్ యార్డును తనిఖీ చేశారు. యార్డులో సమస్యల పరిష్కారానికి దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. వేరుశనగ రైతు శేఖర్‌తో మాట్లాడి వివరాలను తెలుసుకు న్నారు. అనంతరం పత్తి దిగుబడిని పరిశీలించారు. పత్తిని సీసీఐకి విక్రయిస్తే లాభం ఎక్కువగా వస్తుందని సూచిం చారు. జేసీ నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, యార్డ్ సెక్రెటరీ రామ్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించండి
గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రంజిత్ బాషా వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదోని ప్రభుత్వ మాతాశిశు ఆస్పత్రిని తనిఖీ చేసి, రోగులకు వైద్య సేవలను పరిశీలించారు. ఆస్పత్రిలో ఇప్పటికే 12మంది సిబ్బంది ఉన్నారని, అదనంగా 8 మంది స్టాఫ్ నర్సులను డిప్యూటేషన్ చేశామని తెలిపారు. ఆపరేషన్ థియేటర్‌లో టేబుల్ అవసరముందని డీసీహెచ్‌ఎస్ కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో పెచ్చులూడుతున్న గోడల మరమ్మతులకు నివేదిక రూపొందిం చాలని కలెక్టర్ డీసీహెచ్ ఎస్‌ను ఆదేశించారు. డీసీహెచ్‌ఎస్ మాధవి, సూపరింటెండెంట్ మాధవి లత పాల్గొన్నారు.