Share News

సమస్యలను వేగంగా పరిష్కరించండి

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:47 AM

ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిం చాలని, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

సమస్యలను వేగంగా పరిష్కరించండి
అర్జీలను స్వీకరిస్తున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ఆదోని, అక్టోబరు 21, (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిం చాలని, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

వచ్చిన సమస్యలు కొన్ని..

కౌతాళం మండల సులేకేరి గ్రామానికి చెందిన హనుమంతమ్మ బయో మెట్రిక్‌ సమస్యతో పింఛన్‌ అందడంలేదని మం జూరు చేయించాలని కోరారు. బైచిగేరి గ్రామానికి చెందిన ఇందిరా బాయి, ఉమాబాయి, ఉరుకుందమ్మ, చంద్రకళ తమకు 2019లో పట్టాలు ఇచ్చి స్థలాలకు హద్దు చూపలేదని అర్జా ఇచ్చారు. అలాగే తమ ప్రాంతంలో చిరుతపులి సంచరి స్తోందని కాపాడాలని పెద్దకడూరు మండలం మేకడోన గ్రామం కత్తులకొం డ, నరకొండ, జరిమానకొండ, సజ్జలకొం డ గ్రామాల ప్రజలు అర్చీ సమర్పించా రు. ఆదోని మండలం మండగిరికి చెంది న మల్లికార్జున తన పొలం సర్వే నెంబర్‌ 131లో 1.32 ఎకరాల భూమి ఆన్‌లైన్‌లో వేరే వారి పేరు నమోదైందని, సమస్య పరిష్కరించాలని కోరారు. సర్వేయర్లు శ్రీనివాసరాజు, వేణు సూర్య డీఎల్‌డీపీవో, నూర్జహాన్‌, డిఎల్‌డీవో ప్రభాకర్‌ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ పద్మజ, డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి, వలి బాషా పాల్గొన్నారు.

కబ్జాదారులపై చర్యలు తీసుకోండి

ఆదోని టౌన్‌ : మండిగిరి పంచాయతీ పరిధిలో స్థలాన్ని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీఇన్‌చార్జి రమేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేసారు. సోమవారం సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యేకు పర్సనల్‌ పీఏగా చెప్పుకొంటున్న రవి కిరణ్‌ అనే ప్రభుత్వ దంత వైద్యుడు మో సానికి పాల్పడ్డారన్నారు. మాజీ ఉపాధ్య క్షుడు దిలీప్‌ ధోకా, యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి మారుతి, సాయినాథ్‌, దేవిశెట్టి వీరేష్‌, శ్రీనిత్‌, రామకృష్ణ రెడ్డి, వెకంటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:47 AM