సమస్యలను వేగంగా పరిష్కరించండి
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:15 AM
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అధికారులు గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని
1. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన కురువ బసప్ప చిన్నమర్రి వీడు గ్రామ సర్వేనెంబర్ 286 ఎల్‌పీ నెంబర్ 1898కొంత భూమి ఉండగా ఆన్‌లైన్‌లో వేరే వారి పేరు ఉందని మార్చాలని అర్జీ సమర్పించుకున్నారు.
2. గోనెగండ్ల మండలం బి.ఆగ్రహారం గ్రామంలో ఎస్సీల శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అర్జీ సమర్పించుకున్నారు.
3. ఆదోని మండలానికి దివ్యాంగుల భవన ఏర్పాటుకు ఐదు సెంట్ల ప్రభుత్వ భూమి కేటాయించాలని విజేత దివ్యాంగులు అర్జీ సమర్పించుకున్నారు.
4. గ్రంథాలయం పరిసరాల్లో అపరిశుభ్రత, దుర్వాసనతో పాఠకులకు ఇబ్బందిగా ఉందని, పారిశుధ్య పనులు చేయించాలని పాఠకులు అర్జీ ఇచ్చారు. సర్వేయర్లు శ్రీనివాసరాజు, వేణు సూర్య, డీఎల్‌డీపీవో, నూర్జహాన్, డీఎల్‌డీవో ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి, హౌసింగ్ డీఇ రవికుమార్, ఆర్‌అండ్‌బీ డీఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.