Share News

సమస్యలను వేగంగా పరిష్కరించండి

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:25 AM

ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అధికారులను ఆదేశించారు.

సమస్యలను వేగంగా పరిష్కరించండి
అర్జీలను స్వీకరిస్తున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ఎమ్మెల్యే సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ప్రజల నుంచి అర్జీల స్వీకరణ

ఆదోని, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పబ్లిక్‌ గ్రీవెన్స్‌లో మండలాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. మండలంలోని అధికారులు సమస్యలను గడువులోపు పరిష్కరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు.

మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని

1. గ్రామంలో తాగునీటి పైపు మరమ్మతులకు గురికావడంతో నీరు రావడం లేదని మరమ్మతులు చేసి తాగునీరు అందించాలని 104 బసాపురం గ్రామ ప్రజలు అర్జీ సమర్పించుకున్నారు.

2.ఆదోని మండలం నెట్టేకల్‌ గ్రామానికి చెందిన రామాంజినేయులు తనకు సర్వే నెంబర్‌ 113లో 1.57ఎకరాల భూమి పెద్దల నుంచి వచ్చిందని, ఆన్‌లైన్‌లో వేరే వారి పేరుందని, విచారణ చేసి తనపేరు ఎక్కించి, పట్టాదారు పుస్తకం మంజూరు చేయవలసినదిగా ఆర్జీ సమర్పించుకున్నారు.

3. ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా విద్యుత్‌ స్తంభం ఉందని తొలగించాలని గ్రామానికి చెందిన పెద్ద విరుపాక్షి అర్జీ సమర్పించుకున్నారు.

4. ఆదోని మండలం కుప్పగల్‌ గ్రామానికి ఆంజనేయులు తనకు సర్వే నెంబర్‌ 178/1లో ఎకరా భూమి కొనుగోలు చేశానని, అయితే ఆన్‌లైన్‌లో వేరే వారి పేరుందని, విచారణ చేసి ఆన్‌లైన్‌లో తన పేరు ఎక్కించాలని

అర్జీ సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో వసుంధర, సర్వేయర్స్‌ శ్రీనివాసరాజు, వేణు సూర్య, డీఎల్‌డీపీవో, నూర్జహాన్‌, డీఎల్‌డీవో ప్రభాకర్‌ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి, హౌసింగ్‌ డీఈ రవికుమార్‌, ఆర్‌అండ్‌బీ డీఇ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 01:25 AM