సభ్యత్వ నమోదును వేగవంతం చేయండి
ABN , Publish Date - Nov 18 , 2024 | 12:57 AM
టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రి యను వేగవంతం చేయాలని టీడీపీ పాలక మండలి సభ్యుడు మల్లెల రాజశేఖర్ పార్టీ శ్రేణులను కోరారు.
ఓర్వకల్లు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రి యను వేగవంతం చేయాలని టీడీపీ పాలక మండలి సభ్యుడు మల్లెల రాజశేఖర్ పార్టీ శ్రేణులను కోరారు. ఆదివారం మండలంలోని హుస్సేనాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యకర్తకు భరోసా ఇస్తుందని అన్నారు. కార్యక్రమం లో నాయకులు బజారు, వేణు, రజాక్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.