Share News

ఓటర్లను ప్రలోభపెట్టకుండా చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:27 AM

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కర్నూలు, పాణ్యం, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు అరిందం ముఖోపాధ్యాయ (ఐఆర్‌ఎస్‌) తెలిపారు.

ఓటర్లను ప్రలోభపెట్టకుండా చర్యలు తీసుకోవాలి

కర్నూలు(న్యూసిటీ), ఏప్రిల్‌ 18: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కర్నూలు, పాణ్యం, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు అరిందం ముఖోపాధ్యాయ (ఐఆర్‌ఎస్‌) తెలిపారు. గురువారం ఆయన కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయానికి వచ్చారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని క్షుణ్ణంగా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నమోదు చేస్తున్నామని, అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలకు చేస్తున్న ఖర్చును నమోదు చేస్తున్నామని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఏ. భార్గవ్‌తేజ ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా అరిందం ముఖోపాధ్యాయ నగర పాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్కోర్‌ విభాగం, సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకుల విభాగం, అకౌంటింగ్‌, ఎస్‌ఎస్‌టీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వీడియో సర్వేలెన్స్‌ చేస్తున్న వీడియోగ్రఫీ విభాగాల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎన్నికల సంఘం నిర్ణయించిన రేటు ప్రకారమే ఖర్చుల వివరాలను నమోదు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 12:27 AM