నేర నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Dec 21 , 2024 | 12:03 AM
కోసిగి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరాల నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ జి. బిందుమాధవ్ అన్నారు.
ఎస్పీ జి.బిందుమాధవ్
కోసిగి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కోసిగి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరాల నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ జి. బిందుమాధవ్ అన్నారు. శుక్రవారం కోసిగి సర్కిల్ పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్‌లో రికార్డులను ఆయన పరిశీలించారు. ముందుగా ఎస్పీకి సీఐ మంజునాథ్, కోసిగి, పెద్దకడుబూరు ఎస్‌ఐలు చంద్రమోహన్, నిరం జన్‌రెడ్డి గౌరవ వందనం చేశారు. అనంతరం సర్కిల్ కార్యాలయం ఆవరణలో మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం స్టేషన్ పరిధిలోని పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులను, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు, వాటి పురోగతిపై కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కువగా గ్రామంలో పోలీసింగ్ చేపట్టాలని, సమర్ధవంతమైన నేర నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తే వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై, మహిళా చట్టాలపై, నూతన చట్టాలపై ప్రతి గ్రామానికి వెళ్లి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కోసిగి సర్కిల్ కార్యాలయ పరిసరాలను పరిశీలించి ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, ఎస్‌బీ సీఐ ప్రసాద్, డీసీఆర్‌బీ సీఐ గుణశేఖర్‌బాబు, కోసిగి, పెద్దకడుబూరు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.