Share News

నాటుసారా తయారీకి బెల్లం విక్రయిస్తే చర్యలు

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:35 AM

కోసిగి కేంద్రంతో పాటు గ్రామాల్లో నాటుసారా తయారీకి కిరాణం వ్యాపారులు బెల్లం విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్‌ సీఐ భార్గవ్‌ రెడ్డి హెచ్చరించారు.

నాటుసారా తయారీకి బెల్లం విక్రయిస్తే చర్యలు
కిరాణం వ్యాపారులతో మాట్లాడుతున్న ఎక్సైజ్‌ సీఐ భార్గవ్‌ రెడ్డి

కోసిగి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కోసిగి కేంద్రంతో పాటు గ్రామాల్లో నాటుసారా తయారీకి కిరాణం వ్యాపారులు బెల్లం విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్‌ సీఐ భార్గవ్‌ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కోసిగిలోని ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషనలో కిరాణం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఎవరైనా అధిక మొత్తంలో ఐదు కేజీలకు మించి అధిక మొత్తంలో బెల్లంను కొనుగోలు చేస్తే వారి వివరాలు తమకు తెలియజేయాలన్నారు. లైసెన్సులు లేకుండా బెల్లం విక్రయిస్తే వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. కోసిగి చెందిన లారీ డ్రైవ ర్లు కొందరు అక్రమంగా బెల్లం తరలిస్తున్నారన్న సమాచారం ఉందని, వారిపై నిఘా ఉంచామన్నారు. బెల్లం కొనుగోలు చేసిన వారికి రశీదులు ఇవ్వాలన్నారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 12:35 AM