Share News

డ్రోన్‌ హబ్‌ ఏర్పాటుకు చర్యలు

ABN , Publish Date - Nov 11 , 2024 | 12:22 AM

కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని 300 ఎకరాల్లో డ్రోన్‌ హబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా పేర్కొన్నారు.

డ్రోన్‌ హబ్‌ ఏర్పాటుకు చర్యలు
కలెక్టర్‌ను కలిసిన డ్రోన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, సభ్యులు

కర్నూలు కలెక్టరేట్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని 300 ఎకరాల్లో డ్రోన్‌ హబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా పేర్కొన్నారు. ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కే. దినేష్‌ కుమార్‌ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓర్వకల్లు ప్రాంతంలో 300 ఎకరాల్లో డ్రోన్‌ హబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ఓర్వకల్లు మండలం పాలకొలను, కొమరోలు వద్ద డ్రోన్‌ హబ్‌ ఏర్పాటుకు అనువైన స్థలాలుగా సూచించామని తెలిపారు. డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు వల్ల జిల్లాలో ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

Updated Date - Nov 11 , 2024 | 12:22 AM