Share News

పోలైన ఓట్లపై టీడీపీ ఆరా..?

ABN , Publish Date - May 17 , 2024 | 11:45 PM

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులకు పోలైన ఓట్లను ఆరా తీసేపనిలో పడింది.

పోలైన ఓట్లపై టీడీపీ ఆరా..?

బూత్‌ల వారీగా ఓట్ల సేకరణలో బిజీ

నియోజకవర్గాల వారీగా 17ఏ సేకరణ

కర్నూలు(అర్బన్‌), మే 17: సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులకు పోలైన ఓట్లను ఆరా తీసేపనిలో పడింది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి నియోజకవర్గానికి సంబందించి పోలింగ్‌ రోజు ఆర్‌వోలు జారీ చేసిన ఫారం17ఏలను సేకరించే పనిలో పడింది. జిల్లాలోని 7 అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌కు ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోని బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎంత మంది పోలీంగ్‌లో పాల్గొని ఓటు వేశారనే లెక్కలను అరాతీస్తోంది. ఈ క్రమంలో పోలైన ఓట్లను బట్టి పలానా అభ్యర్థికి ఇన్ని ఓట్లు వచ్చాయనే దానిపై స్పష్టత రానుందని అంచనాలు వేసుకుంటున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు ప్రత్యేకంగా పోలైన ఓట్లను బేరీజు వేసుకుంటూ ఎంత మంది అభ్యర్ధులు విజయానికి చేరువలో ఉన్నారనే ముందస్తు కరసత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు సంబంధించి ఎన్ని ఓట్లు పోలయ్యాయన్న దానిపై కింది స్థాయి నాయకత్వం ఇప్పటికే ఆయా అభ్యర్థుల వద్ద లెక్కలు వేస్తోంది. నియోజకవర్గాల వారీగా పక్కగా 17ఏ ద్వారా పోలైన ఓట్లు తెలిస్తే మరింత స్పస్టత రానుందని టీడీపీ వర్గాలద్వారా సమాచారం. ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి నియోజకవర్గాల నుంచి సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి అందజేస్తున్నారు. ఆయన టీడీపీ కార్యాలయంలో ఉంటూ కర్నూలు పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాలపై రోజువారీ సమీక్షలు జరుపుతున్నారు.

Updated Date - May 17 , 2024 | 11:45 PM