పాణ్యంపై టీడీపీ జెండా
ABN , Publish Date - Jun 06 , 2024 | 01:14 AM
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 40,591 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలిచిన గౌరు చరిత పాణ్యం గడ్డపై జెండా ఎగురవేశారు.
గౌరు చరిత విజయంతో అంబరాన్నంటిన సంబరాలు
ఎమ్మెల్యే నివాసంలో టీడీపీ శ్రేణుల విజయోత్సవాలు
కల్లూరు, జూన్ 5: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 40,591 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలిచిన గౌరు చరిత పాణ్యం గడ్డపై జెండా ఎగురవేశారు. సౌమ్యు రాలిగా పేరున్న గౌరు చరిత సాధారణ ఎన్నికల బరిలో నిలిచి టీడీపీ జాతీ య అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రత్యర్థి కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై భారీ మెజార్టీతో ఘనం విజయం కైవశం చేసుకున్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలకు అండగా నిలి చి ధైర్యం చెబుతూ గౌరు దంపతులు పాణ్యం నియోజకవర్గంలో సీని యర్ ఎమ్యెల్యే బలమైన నాయకుడు కాటసానిపై గెలుపొంది విజయం సాధించ డంపై టీడీపీ నాయకులు, కార్యకర్తల అనందానికి అవధుల్లేకుండాపోయాయి.
గౌరు నివాసంలో అంబరాన్నంటిన సంబరాలు: పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో విజయ దుందుభి మోగిం చిన గౌరుచరిత నివాసంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం ఉదయాన్నే ఓర్వకల్లు, గడివే ముల, పాణ్యం, కల్లూరు రూరల్, అర్బన్ ప్రాంతాల నుండి వేల సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, మహిళలు గౌరు నివాసానికి చేరుకుని తమ అభిమాన ఎమ్మెల్యే చరితమ్మకు అభినందనలు తెలిపారు. పూలదండలతో గౌరు దంపతులను ముంచెత్తారు. పూలబోకేలు అందించి, భారీకేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. డీజే పాటలతో, డప్పు వాయిద్యాలతో సంబరాలు జరుపుకున్నారు. పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో అమ్మ హాస్పి టల్ ప్రాంతం సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
గౌరు దంపతులకు వేద ఆశీర్వాదం
కర్నూలు(కల్చరల్): పాణ్యం నియోజకవర్గం నుంచి అఖండ విజయం సాధించిన ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి దంపతులకు మాధవీ నగర్‌లోని వారి స్వగృహంలో వేద పండితులు వేద ఆశీర్వాదలు అం దజేశారు. సంకల్‌బాగ్‌లోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి తీర్థప్ర సాదాలు అందజేసి శేష వస్త్రాలతో, దుశ్శాలువలతో సత్కరించి వేద ఆశీర్వ చనాలు అందజేశారు.