శ్రీమఠంలో నిత్యావసరాలకు టెండర్
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:10 AM
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి నాలుగు నెలలకు అవసరమైన నిత్యావసర సరుకులకు పీఠాధి పతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో టెండర్ నిర్వహిం చారు.
పలువురు విరాళాలు ఇచ్చిన దాతలు
మంత్రాలయం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి నాలుగు నెలలకు అవసరమైన నిత్యావసర సరుకులకు పీఠాధి పతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో టెండర్ నిర్వహిం చారు. మంగళవారం గురు నివాస్ భవనంలో టెండరు నిర్వహించారు. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర, కొబ్బెర, సబ్బులు తదితర వస్తువులపై ఆయా కొటేషన్లు ఉన్నవారు దక్కించుకున్నారు. ఎమ్మిగనూరు చెందిన ఆనంద్ ట్రేడర్స్ యజమాని పది క్వింటాళ్ల ఉప్పు, వంద కేజీల బాస్మతి బియ్యం, 50 కేజీల నువ్వులు, 20 కేజీల నువ్వుల నూనె విరాళంగా ఇస్తానని తెలిపారు. అదేవి ధంగా సిరిగుంపకు చెందిన కోసిగి నాగరాజశెట్టి అనే వ్యక్తి సీకాకాయ, వక్కలు 10 కేజీలు విరాళంగా ఇస్తా మని తెలిపారు. దావనగేరి చెందిన లింగేశ్వర్ అనే వ్యాపారి శ్రీమఠానికి అవసరమైన గోధుమ నూక, ఇడ్లి రవ్వ, కుంకుమను విరాళంగా ఇస్తామని తెలిపారు. ఎమ్మిగనూరు చెందిన రాజారమేష్ అనే వ్యాపారి 35 కేజీల నువ్వుల నూనె, సిరిగుంపకు చెందిన లక్ష్మీనారా యణ శెట్టి 100 కేజీల వంట సోడ, విరాళంగా ఇస్తా మని హామీ ఇచ్చారు. ఉచితంగా విరాళం ఇచ్చిన దాత లకు పీఠాధిపతి శేషవస్త్రం ఇచ్చి ఆశీర్వదించి అభినం దించారు. కార్యక్రమంలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీపతాచార్, ఈఈ సురేష్ కోనాపూర్, స్టోర్ ఇనచార్జిలు రవికులకర్ణి, నారాయణరావు, సూపరింటెం డెంట్లు, అనంతపురాణిక్, ఐపీ నరసింహమూర్తి, ఎస్టేట్ ఆఫీసర్ బి.శ్రీనివాసరావు, జేపీ స్వామి, దత్తు స్వామి, రాజా రమేష్, ఆనంద్, వాఘేంద్రాచార్‌లు పాల్గొన్నారు.