ప్రగతికి బాటలు వేయడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Oct 16 , 2024 | 12:53 AM
పల్లె ప్రగతికి బాటలు వేయడమే ఉమ్మడి ప్రభుత్వ లక్ష్యం అని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.
నందికొట్కూరు రూరల్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పల్లె ప్రగతికి బాటలు వేయడమే ఉమ్మడి ప్రభుత్వ లక్ష్యం అని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. వడ్డెమాను గ్రామంలో మంగళవారం పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో గ్రామాలను పట్టించుకోకపోగా కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా దారి మళ్లించారని అన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర సురేంద్రనాథరెడ్డి, సర్పంచ్ రామచంద్రుడు, అధికారులు పాల్గొన్నారు.
మిడుతూరు: ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని నంది కొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పిలుపునిచ్చారు. మంగళవారం మిడుతూరు, చింతలపల్లి గ్రామాల్లో పల్లె పండగ కార్యక్రమాలను తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో దశరథరామయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజల సమస్యల అర్జీలను ఎమ్మెల్యే జయసూర్య స్వీరరించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, టీడీపీ నాయకులు చెరుకుచెర్ల రఘరామయ్య, దామోదర్‌రెడ్డి, రామస్వామి రెడ్డి, సర్వోత్తమరెడ్డి, శివరామిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, నరసింహగౌడ్, రవీంద్రబాబు, మనోహర్ రెడ్డి, భూపాల్‌రెడ్డి, సుధాకర్, రాముడు, ఇద్రూష్, సుధాకర్‌రెడ్డి, నాగేంద్రుడు అధికారులు పాల్గొన్నారు.
గడివేముల: పల్లె పండుగ కార్యక్రమంతో గ్రామాలలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. గడివేముల, చిందుకూరు గ్రామంలో అభివృద్ధి పనులను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని అన్నారు. మండలంలో 37 పనులకు రూ.2.50 కోట్లు నిధులు మంజూరయ్యాయని అన్నారు. 18 మినీ గోకులాలు మంజూరయ్యాయని అన్నారు. ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి పెద్దపీఠ వేసిందని అన్నారు. అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులు, వెలగమాను ఫీడర్‌చానల్ నిర్మాణాల ఆవశ్యకతను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించామని అన్నారు. త్వరలోనే పనులు చేపట్టి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎంపీడీవో వాసుదేవగుప్తా, తహసీల్దార్ వెంకటరమణ, టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ, గడివేముల సర్పంచ్ రవణమ్మ, మాజీ కో-ఆప్షన్‌మెంబర్ రఫిక్, సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, కృష్ణయాదవ్, సుదర్శన్‌రెడ్డి, హర్ష, ఈశ్వర్‌రెడ్డి, వడ్డు లక్ష్మీదేవి పాల్గొన్నారు.
బండిఆత్మకూరు: కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను విడతల వారిగా నెరవేర్చి తీరుతుందని ఎంఎల్‌ఏ బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణ పురం, లింగా పురం, ఈర్నపాడు, బి. కోడూరు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంఖుస్థాపన చేశారు. బి.కోడూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రస్తుతం శ్రీశైలం నియోజక వర్గంలో రూ.20 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపడుతు న్నామన్నారు. బండిఆత్మకూరులో రూ.2 కోట్లకు పైగా నిధులు వెచ్చించి సీసీ రోడ్లు వేస్తున్నామని చెప్పారు. టీడీపీ నాయకులు సురేష్‌రెడ్డి, నరసింహారెడ్డి, డాక్టర్ భరధ్వాజశర్మ, కంచర్ల మనోహర్‌చౌదరి, రాముడు, రామచంద్రుడు, ఆంబ్రోస్, శంకర్, బాబు, సాయిబాబారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రతాపరెడ్డి, రామకృష్ణారెడ్డి, బాలుడు, చలమయ్య, ప్రతాప్ పాల్గొన్నారు.