Share News

4న జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రాక

ABN , Publish Date - Oct 30 , 2024 | 11:30 PM

జలవనరులు శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులయ్యాక తొలిసారిగా నవంబరు 4న జిల్లాకు రానున్నారు.

4న జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రాక
నిమ్మల రామానాయుడు

కర్నూలు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జలవనరులు శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులయ్యాక తొలిసారిగా నవంబరు 4న జిల్లాకు రానున్నారు. 3వ తేదిన పాలకొల్లు నుంచి అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో బయలదేరి 4వ తేదీ తెల్లవారు జామున 4 గంటలకు డోన్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 5 గంటలకు కర్నూలు స్టేట్‌ గెస్ట్‌హౌ్‌సకు చేరుకుంటారు. 10:30 గంటలకు టీడీపీ కార్యాలయానికి చేరుకుని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం 11 గంటలకు మౌర్యఇన్‌ హోటల్‌లో జరిగే టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ) కూటమి నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు కలెక్టరేట్‌లో సునయన అడిటోరియంలో జరిగితే డీఆర్సీ సమావేశానికి హాజరవుతారు. అనంతరం రాత్రి 9 గంటలకు డోన్‌ రైల్వే స్టేషన్‌కు బయలుదేరి అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరుతారు.

ఉదయం రాజకీయం.. సాయంత్రం అధికార సమీక్ష

ఒకే రోజు ఎన్డీఏ నాయకుల సమావేశం, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం (డీడీఆర్‌సీ) పెట్టడం వల్ల వివిధ శాఖలపై పూర్తిస్థాయి సమీక్ష చేయడం సాధ్యమా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర నెలలు గడిచినా పలు నియోజకవర్గాల్లో పని చేసే కొందరు అధికారుల్లో వైసీపీ వాసన పోలేదు. పలు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకుల మధ్య సమన్వయ లోపం వల్ల సామాన్య కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో టీడీపీ ముఖ్య కార్యకర్తలు, మండల స్థాయి నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. టీడీపీలో విభేదాలు వల్ల పార్టీనే ప్రాణపథంగా భావించిన వైసీపీ అక్రమాలను ఎదురొడ్డిన కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక రోజంతా కూటమి నాయకులకే కేటాయించి నియోజకవర్గాల వారిగా సమీక్షించి నేతల మధ్య సమన్వయం చేయాల్సి అవసరం ఎంతైనా ఉంది. అదే క్రమంలో ఒక రోజంతా శాఖల వారిగా జిల్లా అభివృద్ధిపై సమీక్షలు నిర్వహిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులే అంటున్నారు.

Updated Date - Oct 30 , 2024 | 11:30 PM