వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠ
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:47 AM
మండల పరిధిలోని పెద్దనేలటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈశ్వర దేవాలయంలో గణేశ, సుబ్రహ్మణేశ్వర, శివలింగం, పార్వతిదేవి, బసవేశ్వర, గోపుర కలశం, ధ్వజస్తంభ, నాగదేవతల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు.
గోనెగండ్ల, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పెద్దనేలటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈశ్వర దేవాలయంలో గణేశ, సుబ్రహ్మణేశ్వర, శివలింగం, పార్వతిదేవి, బసవేశ్వర, గోపుర కలశం, ధ్వజస్తంభ, నాగదేవతల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. విగ్రహాలప్రతిష్ఠ కార్యక్రమాన్ని కల్లుహళ్లి సంస్థాన మఠం పీఠాధిపతి చన్న వీరశివాచార్య మహాస్వాములు, కోటేకళ్లు పరమేశ్వస్వామి నిర్వహించారు. గంగామాత వళసం, గోపురం కలశం గ్రామ వీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. గణేశ, నవగ్రహ కలశపూజ, అష్టదిక్కుల కలశపూజ, శిలా విగ్రహాల జలాధివాసం, ధాన్యదివాసం, హోమం నక్షత్ర కలశ పూజ నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా కర్నూలు, ఆదోని, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్స ప్రోగ్రామ్లు ప్రజలను ఆకట్టుకున్నాయి.