Share News

గరిష్ఠంగా ఉల్లి రూ.5,259

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:31 PM

రైతులకు పంటల సాగు జూదంలా మారిపోయింది. ఏ పంటకు ఏ సమయంలో ధర వస్తుందో.. తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

గరిష్ఠంగా ఉల్లి రూ.5,259

పతనమైన ఎండు మిర్చి ధరలు

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రైతులకు పంటల సాగు జూదంలా మారిపోయింది. ఏ పంటకు ఏ సమయంలో ధర వస్తుందో.. తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రెండు రోజుల కిందట ఉల్లికి గరిష్ట ధర రూ.4,200, కనిష్ఠ ధర రూ.400 దక్కగా శుక్రవారం గరిష్ఠ ధర ఏకంగా క్వింటానికి రూ.5,259, మధ్యస్థ ధర రూ.3,519, కనిష్ఠ ధర రూ.515 దక్కింది. వేరుశనగ కాయల ధర మాత్రం నిలకడగా ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి రూ.7వేలకు పైగా ఉన్న గరిష్ఠ ధర ప్రస్తుతం రూ.6,850గా నమో దైంది. మధ్యస్థ ధర రూ.6,109, కనిష్ఠ ధర రూ.4,499 రైతులకు అందినట్లు సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయానికి ఎండు మిరపకాయలకు రూ.25 వేలకు పైగానే గరిష్ఠ ధర నమోదైంది. శుక్రవారం గరిష్ఠ ధర రూ.14,859లు, మధ్యస్థ ధర రూ.11,499, కనిష్ఠ ధర రూ.799 మాత్రమే రైతుల చేతికి అందింది. మొక్కజొన్నలకు గరిష్ఠ ధర రూ.2,269, మద్యస్థ ధర రూ.2,263, కనిష్ఠ ధర రూ.2,119 పలికింది. కందు లు గరిష్ఠ, మధ్యస్థ ధర లు రూ.9,469, కని ష్ఠ ధర రూ.8,609 రైతులకు అందాయి.

Updated Date - Nov 29 , 2024 | 11:31 PM