తాగునీటి సమస్యను పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:49 AM
మండలంలోని చిలకలడోన గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
మంత్రాలయం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిలకలడోన గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం మండల కార్యదర్శి హెచ.జయరాజు, తిక్కన్న, రాముడు ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు, మంత్రాలయం హైవేపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 15 నెలలుగా తాగునీరు సక్రమంగా రావడం లేదని, అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్‌డబ్లూఎస్ ఏఈ వెంకట్రాముడు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్‌రెడ్డి, మండల మాజీ వ్యవసాయ సలహా మండలి చైర్మన విశ్వనాథరెడ్డిలకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాముడు, మాజీ సర్పంచ నర్సన్న, ఎండీ షఫీ, వెంకటేష్, పెద్దయ్య, మాదన్న, వెంకటరెడ్డి, ఉచ్ఛప్ప, రంగమ్మ, పెద్దయ్య, రాజు, దేవపుత్ర, దానియేలు, ప్రకాశం, అంజి, వినోద్ కుమార్, మహానంది, నారాయణలు పాల్గొన్నారు.