Share News

చేతివృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:39 AM

A dharna was organized on Tuesday under the auspices of AP Rythu Sangam in front of the BC Corporation office, demanding to solve the problems of artisans.

చేతివృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలి
ధర్నా చేస్తున్న నాయకులు

కర్నూలు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): చేతివృత్తిదా రుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీసీ కార్పొరేషన కార్యాల యం ఎదుట ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కారన్న మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 50 సంవ త్సరాలు నిండిన చేతివృత్తిదారులైన నిరుపేదలకు పింఛన పథకాన్ని అమ లు చేసి వారికి రుణాలు ఇచ్చి ఆదుకో వాలని కోరారు. మాజీ కార్పొరేటర్‌ గిడ్డ మ్మ, ఏఐవైఎప్‌ నగర అధ్యక్ష, కార్యద ర్శులు బాబయ్య, బీసన్న, సభ్యులు రామాంజనేయులు, రైతు సంఘం జిల్లా సమితి నాయకులు సురేంద్ర యాదవ్‌, కృష్ణ నాయక్‌, రామాంజనే యులు, రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:39 AM