Share News

అక్రమాలకు పాల్పడిన వారిని వదలి పెట్టం

ABN , Publish Date - Nov 17 , 2024 | 11:34 PM

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఎవర్నీ వదలి పెట్టమని కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

అక్రమాలకు పాల్పడిన వారిని వదలి పెట్టం
సమావేశంలో మాట్లాడుతున్న సోమిశెట్టి

కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు అర్బన్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఎవర్నీ వదలి పెట్టమని కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అఽథారిటీ (కుడా) కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఎన్నో అవకతవకలు జరిగాయని, ఎన్నో అక్రమ లేఅవుట్లు వేశారని, లే అవుట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా ఆప్రూవల్‌ వేయాల్సి ఉండగా పంచాయతీ సెక్రటరీలు తమ పరిధిలోని లే అవుట్లకు ఆన్‌లైన్‌ అప్రూవల్‌ చేయించకుండా ఆన్‌లైన్‌ ద్వారా అప్రూవల్‌ చేసి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. దీన్ని అరికట్టడానికి డీపీవోలతో చర్చించిన అనంతరం పంచాయితీలను డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన పంచాయతీ సెక్రటరీలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రజల కోసం అన్ని వసతులు అందుబాటులో ఉంచేందుకు ఎస్‌టీఆర్‌ టౌన్‌ షిప్‌లో తక్కువ ధరలో పేదలకు ప్లాట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైఎస్‌ జగన్‌చేసిన అవినీతి వల్ల అధికారులందరూ ఇరుకున్నారని, వారికి శిక్ష దారుణంగా ఉంటుందని అన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 11:34 PM