Share News

మూడు శాఖలను విచారించాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:24 AM

ఆళ్లగడ్డ పట్టణ శివార్లలోని శిల్పా వెంచర్‌ కోసం అక్రమంగా కేసీ కాలువ తొలగింపునకు సహకరించిన కేసీ, మున్సిపాలిటీ, రిజిస్ర్టేషన్‌ శాఖలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ శాసన సభ స్పీకర్‌ను కోరారు.

మూడు శాఖలను విచారించాలి

అసెంబ్లీలో ఎమ్మెల్యే అఖిలప్రియ

నంద్యాల, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ పట్టణ శివార్లలోని శిల్పా వెంచర్‌ కోసం అక్రమంగా కేసీ కాలువ తొలగింపునకు సహకరించిన కేసీ, మున్సిపాలిటీ, రిజిస్ర్టేషన్‌ శాఖలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ శాసన సభ స్పీకర్‌ను కోరారు. రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో గురువారం ఆమె మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో గత నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన కేసీ ఉప కాలువ ద్వారా సుమారు 7వేల ఎకరాలకు సాగు నీరు అందుతోందన్నారు. అలాంటి కాలువను వైసీపీ ప్రభుత్వంలో శిల్పా చక్రపాణిరెడ్డి తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం నిబం ధనలకు విరుద్ధంగా కేసీ కాలువను తొలగించారని స్పీకరుకు వివరించారు. కేసీ కాలువ తొలగింపునకు ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, కేసీ అధికారులు, రిజిస్ర్టేష న్‌ అధికారులు పూర్తిగా సహకరించారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఆళ్లగడ్డకు వచ్చినపుడు శిల్పా వెంచర్‌లో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపడతామని చెప్పారని గుర్తు చేశారు.

Updated Date - Jul 26 , 2024 | 12:24 AM